2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ముంచుకొస్తున్న ప్రమాదకరమైన జబ్బు ఇదే?

"ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా!

‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిన్న కులం నుంచి వచ్చాడు!

నాయీ బ్రహ్మణుల పట్ల అసహ్యంగా ప్రవర్తించిన చంద్రబాబు! 

‘కేసీఆర్ నన్ను భట్రాజు పొగిడినట్టుగా పొగిడాడు! "


ఇవీ తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కుల దురహాంకారపు వ్యాఖ్యలు. వేరే ఎవరైనా రాజకీయ నేతలు కులం విషయంలో ఇలా మాట్లాడి ఉంటే వాళ్ల పొలిటికల్ ఖేల్ ఖతం ప్రజాక్షేత్రంలో దుకాణ్ బంద్ అయ్యేది అయితే అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన ఎంత దారుణంగా మాట్లాడినా వేల గొంతుకలతో ఝంఝామారుతంలా ప్రచారం చేసే కుల మీడియా ఉండటంతో ఆయనకు చెల్లిపోతోంది. చంద్రబాబు ఒక చేతిలో అధికారం మరో చేతిలో అను’కుల’ మీడియా వర్గాలున్నాయి కాబట్టి ఏమైనా మాట్లాడగలడు.


అయితే చంద్రబాబు నాయుడు కులం విషయంలో కూడా దారుణంగా మాట్లాడుతున్నాడు. బీసీలను, ఎస్సీలను దారుణంగా అవమనిస్తూ మాట్లాడటానికి కూడా చంద్ర బాబు వెనుకాడటం లేదు. ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడికి కులగజ్జి దేహమంతా పాకి అల్లుకుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


చంద్రబాబు నాయుడు పాలనపై ఇప్పటికే కులం విషయంలో తీవ్ర విమర్శలున్నాయి. తమ కులం వారిని ఉద్ధరించడానికే పాలిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. బాబు పాలనలో అమరావతి ఒక కులరాజ్యంగా మారిందనే అభిప్రాయాలున్నాయి. వాటికి తోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా బడుగు బలహీన కులాలను కించ పరిచేలా మాట్లాడు తూ ఉండటం విశేషం. చంద్రబాబు నాయుడు ఇలాంటి కుల వివక్షతో కూడిన మాటలను మానుకోకుండా, అదే తీరును కొనసాగిస్తూ ఉన్నాడు. బహుశ రానున్న కాలంలో ఈయన రాజకీయ ఆయన అవినీతి కంటే ముందే ఆయన కులగజ్జే హరించి వేస్తుందన్నది నూరుపాళ్ళు నిజం కాబోతుంది.

 

చంద్రబాబు కుల అభిమానం — రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేసింది?


మన నాయకులందరూ కూడా కుల రాజకీయాలు అంటే బయటకు అయిష్టత నటిస్తూ, అంతరంగమంతా కుల గబ్బుతో తరించిపోతుంటారు. రాజకీయ నాయకుడుగా ప్రజాక్షేత్రంలో తనకు తానుగా  వికసించే దశలో ఉన్న పవన్ కళ్యాణ్ తనకు కులం టాగ్ అంట గడితే చంపేస్తాను అనే స్థాయిలోరెచ్చిపోతుంటారు. కాని అయన చుట్టూ ఉండే పరిజనుల్లో జ్యేష్ట భాగం కాపులే. 


ఇక టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే తన రాష్ట్రానికి కొన్ని యోజనాల దూరం నుంచే  కులం కంపు గొట్టే ప్రపంచ ప్రఖ్యాతి గాంచ బోయే అమరావతి పేరుతో అద్భుత రాజధానినే నిర్మిస్తున్నారు. కాని పైకి మాత్రం ఆయన తనకు తన కమ్మ కుల అభిమానాలు, అనుభంధాలు ఏమీ లేని అనుపమానినని సమయం వచ్చినప్పుడల్లా ఢంకా వాయించేస్తుంటారు.

నాయీ బ్రహ్మణుల పట్ల అసహ్యంగా ప్రవర్తించిన చంద్రబాబు 


అయితే రాష్ట్రంలోని సరిహద్దు జిల్లా అనంతపురానికి బెంగుళూరు, హైదరాబాద్ కంటే దూరం అయిన అమరావతి ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారో చెప్పరు. ముక్కారు పంటలు పండే బంగారు నేలను కాంక్రీట్ అరణ్యం చేయబూనటం — అది జగమంతా తెలిసిన కమ్మ గుట్టు అంటారు మిగిలిన వారంతా. కమ్మ గుట్టు గడప దాటదు అనేది కమ్మ కులంపై జనాంతికం.


యథా రాజా! తథా ప్రజా! అన్నట్లు ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో కూడా కుల సమీకరణాల ప్రభావం వెల్లువెత్తుతుంటూ ఉంటుంది. కమ్మ మద్దతుతోనే ఆయన నాయకుడిగా ప్రఖ్యాతి గాంచాడు. ఆయనకు తీవ్రమైన కుల మీడియా మద్దతు ఉంది. ఆ మీడియాకు ఆయన మాటే వేదం. ఆయన స్వరానికి ఆ మీడియా కోట్ల ద్వని తరంగాలను సృష్టించి ప్రచారం చేస్తుంది. ఇంకేం ఆయన పాలన మూడు పూవులు ఆరుకాయలతో విలసిల్లుతుంది.


సినిమా, పాలిటిక్స్‌, బిజినెస్‌, పరిశ్రమ రంగాలని ఆయన తన కులానికే దారా దత్తం చేశారు. అలాగే కమ్మ జనులు సైతం అంతే అభిమానాన్ని ఆయనకు రెసిప్రొకేట్ చేయటం నిత్యం చూస్తూనే ఉన్నాం. వారి ప్రయోజనాల కోసం వారు చంద్రబాబును గెలిపించడానికి ఎప్పుడూ క్రమం తప్పని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కులం చేత, కులం కోసం, కుల జనులే..... ఇతర కులాల మద్య ఒక దీవి లాంటి  కులరాజ్యం నిర్మించుకొని ఆధిపత్యం నెరపటమే చంద్రబాబు ఆయన కులజనుల జీవితాశయం అంటుంటారు పరిశీలకులు విశ్లేషకులు.


2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ని దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మలచారు. అమరావతి - అవినీతి కవలపిల్లలుగా నిలబెట్టటంలో ఆయన సాధించిన విజయం అనితర సాధ్యం అనేది జనంలో వినిపించేమాట. 


కులం మాఫియాలాగా అభివృద్ధి చెందటానికి ప్రధానకారణం చంద్రబాబు కేంద్రంగా పనిచెసే కుల మీడియా అంటారు జనం. అంతేకాదు అమరావతిని అవినీతికి అడ్డా గా నిలబెట్టాడన్న అపవాదును చంద్రబాబు మూటగట్టు కోవడానికి కారణం తాను అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళతో పాటు చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి ఒక స్థాయిలో పెచ్చరిల్లడాన్ని వారి ఒకనాటి రాజకీయ భాగస్వామి పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. అంతే కాదు చంద్రబాబును అవినీతిపై ప్రశ్నించని రాజకీయపార్టీ రాష్ట్రంలో లేదంటే ఆశ్చర్యం లేదు. ఇక పవన్ కూడా తాజాగా కుల రాజకీయాలు బాగానే ఒంటపట్టించుకున్నాడు. కర్ణాటక ఎన్నికల తర్వాత మొత్తం రాష్ట్రంకంటే తన వర్గం జనాభా ఎక్కువ గా ఉన్న ఉత్తరాంధ్రపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు పవన్ కళ్యాన్ అంటున్నారు పరిశీలకులు.


ఆ మధ్య అనంతపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్ కళ్యాన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వే లో ధారుణ ఓటమి తప్పదని తేలడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తాను అని మాట మార్చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ లక్ష్యం "కాపులు" మాత్రమే అని అనడంలో సంకోచించాల్సిన అవసరమేలెదంటారు అమరావతి జనం. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా అండగా నిలవటమే కాకుండా కాపుజనుల చేత కూడా చంద్రబాబుకు మద్దతు ఇప్పించిన ఘనుడు పవన్ కళ్యాణ్. ఈ సారి 2019 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఓట్లను పూర్తిగా తనవైపు వేయించుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బ్రాహ్మణులు ఇతర అగ్రకులాలను కమ్మ కులగజ్జితో పూర్తిగా దూరం చేసుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు, చివరకు మిగిలేది బీసీలు, కమ్మ కులస్తులు మాత్రమే. అయితే వారిపై ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వారిలో కొందరిని దూరం చెసే అవకాశం తీవ్రంగా ఉందని అంటున్నారు.


ఇక వైసిపి అధినేత ప్రతిపక్షనాయకుడు జగన్మోహనరెడ్డికి రెడ్లు, అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీలు, మస్లిముల మద్దతు బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసిపికి  మద్దతు ఇవ్వాలని తాజాగా బ్రాహ్మణులు నిర్ణయిచుకోవటం ఆయనకు పెద్ద షాకే! తాజాగా కాంగ్రెస్ అధినేతగా ఉన్న బీసీ నాయకుడు రఘువీరారెడ్డి కూడా వైకాపాలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సారి బీసీల్లో కూడా వైసిపి పట్టు సాధించే అవకాశం మెండుగా ఉందని తాజా సర్వేలు తేల్చిచెపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం తన సొంత కమ్మ కుల జనులతో పాటు కొన్ని మేజర్ బీసీ కులాలను నమ్ముకుని ఎనీకల రణరంగంలోకి దిగుతున్న చంద్రబాబు, కాపులకు మాత్రమే నాయకుడిగా నిలబడిపోయే అవకాశమున్న పవన్ కంటే కంటే రెడ్లు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిములు, అగ్రవర్ణాల వారి ఓట్లు కొల్లగొట్టడంతో పాటు బీసీలు, కాపుల ఓట్లకు కూడా ఎంతో కొంత గండి కొట్టగల  అవకాశం వైసిపికి ఉందని ఒకరకమైన అంతర్గత నిశ్శబ్ధ వ్యతిరేఖ ప్రభంజనం ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉందనేది రాజకీయ పరిశీలకుల వాదన.

కమ్మ కులానికి ప్రత్యేక డీఎన్ఏ ఉందా..? టీవీ9 హాట్ డిస్కషన్..!?


చంద్రబాబు ప్రతిపక్ష ఎమెల్యేలను కొనటం, ఓటు కు నోటు కేసు, రాయపాటి లాంటి స్వకుల గుత్తేదార్లకే అన్ని అవకాశాలు ఇవ్వటం, సిఎం రమేష్, సుజానా చౌదరి, బీద మస్తాన్ రావు లాంటి అవినీతిపరులతో సాన్నిహిత్యం, రాష్ట్రంలో సీబీఐ ప్రవేశ నిషేధం తను తనవాళ్ళు అవినీతి పరులేనని ఋజువు గా బావిస్తున్న  ఇదంతా చంద్రబాబుకు అధికారం దక్కదని రూఢీ చేస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తన అర్ధంగాని ప్రవర్తనతో సినిమాటిక్ నడవడితో అధికారంలోకి రావటం, ఈసారి అసాధ్యం అని ఈ కులసమీకరణాల సర్వే చెప్తోంది. 2019 లో జగన్మోహనరెడ్డి గెలవడం ఖాయమని "సీనియర్ జర్నలిస్టులు చేపట్టిన కుల సమీకరణాల సర్వే" తెలుపుతుంది. ఇదే ఇఫ్పుడు జర్నలిస్ట్ సర్కిల్‌లో హాట్ టాపిక్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: