శబరిమలలో మళ్లీ కలకలం..? ఈసారి శ్రీలంక మహిళ..?

Chakravarthi Kalyan

రెండు, మూడు రోజులుగా అట్టుడుకుతున్న శబరిమలలో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే సీపీఎంకు చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఆలయ సిబ్బంది సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత కేరళతో పాటు దేశమంతటా నిరసనలు చెలరేగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కలకలం రేగింది. గురువారం రాత్రి సమయంలో మరో 46 ఏళ్ల అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంది. ఈమెను శ్రీలంకకు చెందిన శశికళగా చెబుతున్నారు. రికార్డుల ప్రకారం ఈమె వయస్సు 46 ఏళ్లుగా ఉంది. ఆమె తన మెనోపాజ్‌ అయినట్టు డాక్టర్ సర్టిఫికెట్‌ కూడా సమర్పించిందట.



శశికళ అయ్యప్ప ఆలయంలోని పదునెట్టాంబడి ఎక్కి.. గర్బగుడిలో పూజలు చేసిందట. రాత్రి 9 గంటల సమయంలో దర్శనం చేసుకుని రాత్రి 11 గంటలకు పంపకు చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు. శశికళ ముందుగానే దర్శనం కోసం నమోదు చేసుకున్నారని కూడా వారు వివరిస్తున్నారు.



ఇప్పటికే ఇద్దరు మహిళల దర్శనం పట్ల దేశమంతటా ఆందోళన చెలరేగుతున్న సమయంలో శశికళ దర్శనం కూడా వివాదస్పదం అవుతుందని పోలీసులు ముందుగానే ఊహించారు. అందుకే ఆమె దర్శనం విషయాన్ని ముందు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. పటిష్టమైన భద్రత మధ్య ఆమెకు దర్శనం అవకాశం కల్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: