జగన్ ఆస్తులకేసులు మళ్లీ మొదటికే!



వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 25 కు వాయిదా పడింది. సీబీఐ ఈడీ కోర్టు న్యాయ మూర్తి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ కు  బదిలీ కావడంతో, నూతన న్యాయమూర్తి రిపోర్ట్ చేసే వరకు దీనిపై విచారణ ఆగిపోనుంది. జడ్జి వెంకటరమణ గత రెండేళ్ల పాటు మూడు ఛార్జిషీట్లపై సుమారు 100 గంటలపాటు వాద, ప్రతివాదనలు విన్నారు.


వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు నేడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ ఇప్పటికే దాదాపు జగన్, విజయసాయి రెడ్డి సహా మిగతా నిందితులందరిపైనా మళ్లీ మొదటి నుంచి విచారణ జరగనుంది.ఉమ్మడి హైకోర్టు విడిపోవడంతో నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త న్యాయమూర్తిని ఇంకా నియమించ లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరు న్యాయమూర్తిగా నియమితులైనా, తిరిగి వాదనలను ఆయన మొదటి నుంచి వినాల్సిందే. కాగా, నేడు శుక్రవారం నాడు వైఎస్ జగన్ కోర్టు విచారణకు హాజరుకాగా, విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ, 25కు తిరిగి విచారణలు మొదలవుతాయని తాత్కాలిక న్యాయమూర్తి తెలిపారు.

  • Home
  • Flash News
  • Video News
  • Tv
  • News Papers
  • Links
  • Cinema
  • Articles
  • Telugu Articles
  • Bhakti
  • Advertise

జగన్ ఆస్తుల కేసులో ట్విస్ట్... సీబీఐ కోర్టులో మొదటి నుంచి విచారణ!

Fri, Jan 04, 2019, 11:35 AM
 
 
 
 
  • ఏపీకి బదిలీ అయిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి
  • మూడేళ్ల నుంచి వాదనలు వింటున్న వెంకటరమణ
  • ఇంకా కొత్త న్యాయమూర్తిని ప్రకటించని హైకోర్టు
వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు నేడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ ఇప్పటికే దాదాపు ఐదేళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. 11 చార్జ్ షీట్లు ఇప్పటివరకూ దాఖలుకాగా, మూడు చార్జ్ షీట్లపై రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. అది తిరిగి మొదటికి వచ్చింది. సీబీఐ కోర్టులోనే జగన్, విజయసాయిరెడ్డి సహా మిగతా నిందితులందరిపైనా మళ్లీ మొదటి నుంచి విచారణ జరగనుంది.

ఉమ్మడి హైకోర్టు విడిపోవడంతో నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త న్యాయమూర్తిని ఇంకా నియమించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరు న్యాయమూర్తిగా నియమితులైనా, తిరిగి వాదనలను ఆయన మొదటి నుంచి వినాల్సిందే. కాగా, నేడు శుక్రవారం నాడు వైఎస్ జగన్ కోర్టు విచారణకు హాజరుకాగా, విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ, 25కు తిరిగి విచారణలు మొదలవుతాయని తాత్కాలిక న్యాయమూర్తి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: