బాలయ్య దబిడి దిబిడే తన్నుడుకు.. కీరవాణి సమర్ధన..?

Chakravarthi Kalyan

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో మీడియాకు ఆయన విరివిగా ఇంటర్య్యూలు ఇస్తున్నారు. ఎన్టీఆర్‌తో అనుబంధం, బాలయ్యతో పనిచేయడం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.



ఈ సందర్భంలో ఆయన బాలకృష్ణ పనితీరుపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. బాలకృష్ణతో జర్నీ చాలా హ్యాపీగా ఉందన్న కీరవాణి గతంలో ఆయనతో పనిచేసిన రోజులు గుర్తు చేసుకున్నారు. గాండీవం, బొబ్బిలి సింహం, పాండురంగడు సినిమాలకు కీరవాణి మ్యూజిక్ అందించారు.



ఎన్టీఆర్‌ లాగానే బాలయ్య కూడా బోళామనిషి అంటున్నారు కీరవాణి. ఆయనకు లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడటం తెలియదు. ఆయన చాలా నిజాయితీగా ఉంటారని మెచ్చుకున్నారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే ఆయనతో ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది అన్నారు కీరవాణి.



మరి బాలయ్యకు కోపం, అభిమానుల్ని కొడతారని అంతా అంటుంటారు కదా అని అంటే.. ఆ మాటలను తేలిగ్గా తీసిపారేశారు కీరవాణి. సమయం సందర్భం లేకుండా సెల్పీలని మీద పడితే ఎవరికి కోపం రాదు చెప్పండి.. అంటూ బాలయ్యను సపోర్ట్ చేశారు కీరవాణి. మరి ఈ సమస్య సెలబ్రెటీలందిరకీ ఉంటుంది కదా.. అందరూ బాలయ్యలా చేయి చేసుకుంటున్నారా అంటే ఏమంటారో కీరవాణి?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: