కొడుకు కోసమే... ఓడించండి...!!

Satya
ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ   ఒకలా ఉన్న వాతావరణం ఇపుడు చలి గాలులను సైతం మించి వేడి రాజేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది నెలల్లో ఉన్నాయనగానే రాజకీయం కూడా రంగు మార్చుకుంటోంది. అసలు గుట్టు లాగేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే పదునైన వ్యూహాలకు నేతాశ్రీలు పదును పెడుతున్నారు.


కొడుకే కావాలి :


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొడుకు అభివ్రుద్ధి తప్ప మరేమీ కనిపించడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. ఏపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మోడీ నిర్వహించిన  వీడియో కాంఫరెన్స్ లో బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు బాబు రాజకీయం అంతా కుటుంబం కోసమేనని దులిపేశారు. తాను కొడుకు తప్ప ఏపీ అభివ్రుధ్ధి అన్నది బాబు మరచిపోయారని హాట్ కామెట్స్ చేశారు. సన్ రైజ్ స్టేట్ అంటూ ఊకదంపుడు ప్రకటనలు ఇస్తున్న బాబు నిజానికి సన్ (కొడుకు) రైజింగ్ మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. కొడుక్కి మాత్రమే పదవులు కట్టబెట్టడాన్ని ఎద్దేవా చేసారు.  బాబు పాలనలో ఏపీ ఏ విధంగానూ ప్రగతి బాట పట్టలేదని మోడీ విమర్శించారు. 


అదే నివాళి :


ఇక టీడీపీ వ్యవష్తాపక అధ్యక్షుడు ఎంటీయార్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపారని మోడీ గుర్తు చేసారు. అప్పట్లో నేషనల్ ఫ్రంట్ పేరిట కాంగ్రెస్ కి వ్యతిరేక కూటమికి ఎంటీయార్ మద్దతుగా నిలిచి జాతీయ స్థాయిలో ఆ పార్టీని అధికారం నుంచి దించేందుకు క్రుషి చేశారని అన్నారు. ఐతే ఇపుడు అదే పార్టీని కాంగ్రెస్ తో పొత్తుల పేరిట చంద్రబాబు దిగజార్చారని, ఎంటీయార్ ఆశయాలకు తూట్లు పొడిచారని మోడీ ద్వజమెత్తారు. కాంగ్రెస్లో టీడీపీని కలిపేసిన చంద్రబాబును ఓడించడమే ఎంటీయార్ కి నిజమైన నివాళి అని మోడీ బీజేపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.


అసహన దాడులు :


బీజేపీ కార్యకర్తలపై ఏపీలో జరుగుతున్న దాడులు, ఏకంగా చంద్రబాబు బెదిరింపులపై మోడీ స్పందిస్తూ అదంతా ఓడిపోతామన్న భయం నుంచి పుట్టుకువస్తున్న అసహనం అని మోడీ అన్నారు. ఇలా అసహనంతో చేసే దాడులకు జనమే తగిన రీతిన స్పందిస్తారని మోడీ అన్నారు. కార్యకర్తలు ఎవరూ ఎక్కడా తగ్గకూడదని, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రయలు స్పూర్తిగా తీసుకుని ఎపీలో బీజేపీ విజయానికి బాటలు వేయాలని మోడీ కోరారు. ఏపీలో బీజేపీ బలంగా ఉందని, రాబోయే రోజుల్లో అద్భుతాలు స్రుష్టిస్తుందని మోడీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు  దేశం కోసం పనిచేస్తున్నారని, మిగిలిన పార్టీల మాదిరిగా పదవుల రాజకీయం వారికి తెలియదని కితాబు ఇచ్చారు. మొత్తానికి మోడీ బాబుపై యుద్ధానికి రెడీ అయిపోయారని క్లారిటీ వచ్చెసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: