కేసీఆర్ పథకం గురించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసిన జగన్ ... నా పథకం 5 రేట్లు మిన్న ...!

Prathap Kaluva

ఒక మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్ చాలా విషయాల మీద మాట్లాడినాడు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అసలు కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రకటించడానికి చాలా ముందే... అదే పథకం మాదిరిగా రైతు భరోసా పేరిట తాను ఓ పథకాన్ని ప్రకటించానని తమ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లో అది కూడా ఒకటి అని ఆయన పేర్కొన్నారు.


పాదయాత్ర మొదలుపెట్టక మునుపే గుంటూరు వేదికగా నిర్వహించిన తమ పార్టీ సభలో ఈ పథకాన్ని తాను ప్రకటించానని కూడా జగన్ చెప్పారు. మొత్తంగా కేసీఆర్ రైతు బంధు పథకం కంటే ముందుగానే తాను రైతు భరోసా పథకాన్ని ప్రకటించానని జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రైతు బంధు కంటే కూడా తాను ప్రకటించిన రైతు భరోసానే రైతులకు మరింతగా లబ్ధి చేకూరుస్తుందని కూడా జగన్ పేర్కొన్నారు.


తాను ప్రకటించిన పథకంలో ప్రతి ఎకరాకు రూ.12500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని అలా ఏడాదికి నాలుగు సార్లు... అంటే మొత్తంగా ఎకరం పొలం ఉన్న రైతు ఖాతాలోకి ఏకంగా రూ.50000లను జమ చేస్తామని చెప్పారు. ఈ లెక్కన చూస్తే... రైతు బంధు పథకం కంటే జగన్ ప్రకటించిన రైతు భరోసా ఎన్నో రెట్లు మేలనే మాట వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: