బాలయ్యతో నాగబాబు చెడుగుడు..! షార్ట్ ఫిలింతో పరువు తీసేశాడు..!?
గతంలో ఓ సినిమా ఫంక్షన్లో అమ్మాయి కనిపిస్తే.. ముద్దైనా పెట్టాలా.. లేదా... కడుపైనా చేయాలా అంటూ బాలయ్య నోరు జారాడు. అప్పట్లో అది పెద్ద దుమారమే లేపింది. ఇప్పుడు బాలయ్యపై రోజుకో రకంగా యుద్ధం చేస్తున్న నాగబాబు.. వీడియో వార్ చేస్తున్నారు. బాలయ్యను తలపించేలా ఎర్రోడు అనే క్యారెక్టర్‌ను డిజైన్ చేసి మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలిమ్ రిలీజ్ చేశారు.
ఈ షార్ట్ ఫిలిమ్‌లో ఓ వ్యక్తిని ఆడవాళ్లంతా రౌండప్ చేసి చితకబాదుతుంటారు. ఆ సీన్ కారులో వెళ్తున్న నాగబాబు చూస్తాడు. మనకెందుకులే అని ముందుకు వెళ్తాడు.. అక్కడ కూడా సేమ్ క్యారెక్టర్‌ను ఆడోళ్లు కుమ్మేస్తుంటారు.. మళ్లీ మనకెందుకులే అని నాగబాబు ముందుకెళ్తాడు.
ఈసారి ఆ క్యారెక్టర్ ఆడోళ్ల దెబ్బలు తాళలేక నాగబాబు కారుకు అడ్డంపడతాడు. నాగబాబు ఆ లేడీస్ ను సముదాయించి పంపేస్తాడు.. అవును నిన్నెందుకు కొడుతున్నారయ్యా ఆడాళ్లు..అని నాగబాబు అడిగితే.. ఏం లేదండీ.. అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి అని పెద్దోళ్లు చెప్పారు కదా.. నేను ముద్దు మాత్రమే అడిగే.. ఆ మాత్రానికే కొడుతున్నారంటాడు. అప్పుడు కడుపుమండిన నాగబాబు.. ఆ మహిళలను పిలిచి వారికి ఆ వ్యక్తిని అప్పగిస్తాడు. ఇందులో ఎక్కడా బాలకృష్ణ పేరు లేకపోయినా.. ఆ మాత్రం అర్థం చేసుకోలేదని వారు ఎవరూ లేరు కదా. నాగబాబుకు కావల్సింది కూడా అదే కావచ్చు.