హీరో : జగన్‌, డైరెక్టర్‌ : కేసీఆర్, టైటిల్‌ బ్లఫ్‌ మాస్టర్‌..!

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఓవైపు జగన్ తన చరిత్రాత్మక పాదయాత్ర పూర్తి చేసుకుని జోష్ మీద ఉన్నారు. సీఎం చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం ఆరు లక్షల అవినీతి చేశారంటూ ఓ పుస్తకం విడుదల చేశారు.



మరోవైపు టీడీపీ నేతలు కూడా జగన్ విమర్శలను సమర్థంగానే తిప్పికొడుతున్నాయి. ప్రపంచంలో అందరూ అవినీతి పరులు... నేను మాత్రం నిజాయితిపరుడుని అన్నట్లు జగన్ మాటలు ఉన్నాయని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 5సార్లు సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగా..జగన్ సీఎంపై రాసిన పుస్తకంలో 6లక్షల కోట్ల అవినీతి అని రాశారని గుర్తు చేస్తున్నారు.


జగన్ అంత పెద్ద అవినీతి పరుడు మరొకరు దేశంలోనే లేరని.. దేశంలోనే తక్కువ వయస్సులో ఎక్కువ అవినీతి చేసిన రికార్డు జగన్‌దేనని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఉనికిని దెబ్బకొట్టాలని మోడీ చూస్తుంటే...దానికి జగన్,కేసీఆర్ మద్దతు పలకడం శోచనీయమన్నారు ఆదినారాయణరెడ్డి.



మరో టీడీపీ మంత్రి ఉమామహేశ్వరరావు కూడా జగన్‌ ను సినీ భాషలో విమర్శించారు. ఇటీవల వచ్చిన సినిమా టైటిల్ బ్లఫ్ మాస్టర్‌ను ఇందుకు వాడుకున్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అంటున్న టీడీపీ నేతలు.. ఆయన కేసీఆర్ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జగన్‌కు సీఎం కుర్చీ తప్ప ఏమీ కనపడదని మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: