రాహుల్ జీ! మిషెల్ మామ అగస్టాలో ముడుపులు బోంచేశారు - రాఫేల్ ను టార్గెట్ చేశారు: మోడీ

కాంగ్రెస్ చరిత్ర సమస్తం ప్రజా పీడన పరాయణత్వం. దేశానికి స్కాములు ఎమర్జెన్సీని వారసత్వం బానిసత్వం పరిచయం చేసిన చరిత్ర దానిది. అలాంటి పార్టీ ఎంతో కొంత అవినీతి మచ్చలు లేని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవినీతి బురద పూయాలని చూస్తుంది. కారణం రాహుల్ గాంధి కుటుంబ మితృడు క్రిస్టియన్ మిషెల్‌ ను మధ్యవర్తిగా నియమించి కమీషన్లు దండుకొనే అవకాశం యివ్వలేదనే! అంటున్నారు బిజెపి అధినాయకత్వం.

*గతంలో సోనియా గాంధి కుటుంబ సన్నిహితుడు ఖత్రోచి బోఫోర్స్ ఆయుధాల సరఫరాలో కమీషన్లు బొక్కారు.
*అలాగే వారి మితృడే క్రిస్టియన్ మిషెల్‌ అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో ముడుపులు భోంచేశారనే ఆరోపణలు ఉన్నాయి అది విచారణలొ ఉంది.
*ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ ఇద్దరు ₹100 కోట్లు ఆదాయపు పన్ను ఎగవేత ఋజువైంది. ఆదాయపన్ను శాఖ ₹300 కోట్లు కట్టమని తాఖీదులు పంపింది.

ఇలాంటి అవినీతి నిలయం నేడు మోడీపై రాఫేల్ నిందలు వేయటం లోని ఔచిత్యం తమకున్న మచ్చలను కొద్దిగానైనా మోడీకి అంటిస్తే తాము 'సేఫ్' అవ్వవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   


అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో దళారీగా ఉన్న క్రిస్టియన్‌ మిషెల్‌,. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కంపెనీ తరఫునా లాబీయింగ్‌ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. డసో ఏవియేషన్‌కు ప్రత్యర్థిగా ఉన్న ‘యూరోఫైటర్‌’ తరఫున మిషెల్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టిన "అగస్టా వెస్ట్ ల్యాండ్" వ్యవహారంలో దళారీ పాత్ర వహించిన - మిషెల్ మామ - తో మీకున్న సంబంద బాందవ్యాలు ఏమిటని? ప్రధాని నరేంద్ర మోదీ  ప్రశ్నించారు.


రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అదే పనిగా ఆరోపణలు చేస్తుండడం తో దీనికి ప్రధాని మోదీ బ్రహ్మాండమైన కౌంటరిచ్చారు. దేశం ఆయుధాల కొరతతో అలమటిస్తూ ఉంటే రఫేల్‌ ఒప్పందం అప్పట్లో నిలిచి పోవడానికి కారణం "మిషెల్‌ మామ" ఒప్పందాలేనా? అని ప్రశ్నించారు. కమీషన్ల లెక్కలు కుదరకే దేశ రక్షణను ముడుపులకోసం ప్రక్కనబెట్టిన రాహుల్ కుటుంబ ప్రభుత్వం రాఫేల్ పై మాట్లాడటం మరీ విడ్దూరం అన్నారు ప్రధాని  


ఈ రఫెల్ విమానాల డీల్ కోసం పోటీ పడిన "యూరో ఫైటర్" తరఫున అగస్టా వెస్ట్ ల్యాండ్ ఫేం క్రిస్టియన్ మిషెల్  లాబీ చేశాడని ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో namoa ఈ వ్యాఖ్యలు చేశారు.


మహారాష్ట్ర లోని షోలాపూర్ లో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న నరేంద్ర మోదీ, మరో సంస్థ తరఫున రాహుల్ గారి మిషెల్ మామ!  లాబీ చేస్తూ వచ్చాడని, అయితే "రఫెల్ ఒప్పందంపై గొంతులు చించు కుంటున్న మీకు మీ కాంగ్రెస్ నాయకులకు, ఇతనికి మధ్య ఉన్నలింకు లేమిటో చెప్పాలని"  అన్నారు. ఈ "చౌకీదార్" అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారా? అని నిలదీశారు. ముడుపులు పుచ్చుకుంటున్న ఈ నేతలంతా ఈ చౌకీదార్ నే భయపెట్టాలని చూస్తున్నారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించవని ఆయన పేర్కొన్నారు.


"ఈ కాపలాదారు నిద్ర పోడు..భయపడ బోడు కూడా! నా మీద మీరెంతైనా బురద జల్లవచ్చు. కానీ "సఫాయీ" అంటే శుద్ది కార్యక్రమం ఆ తరవాత కొనసాగు తుంది. అది ఆగదు ఆగబోదు" అని ఆయన తన నిశ్చిత నిర్ణయాన్ని వ్యాఖ్యానించారు.


వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి ఎక్కువ ధరకు రఫెల్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందని రాహుల్ గాంధి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు-అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కేసులో అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్‌ను ఢిల్లీ కోర్టు మూడు రోజుల క్రితం జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఈ కేసులో ఈయన 24.25 మిలియన్ యూరోలను, 16.1 మిలియన్ పౌండ్లను ముడుపులుగా స్వీకరించడమే గాక, ఇతర డీల్స్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేశాడ ని ఈడీ ఆరోపించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: