అలిమనీ తోనే ఆమె రిచ్చెస్ట్ అయింది - ప్రపంచలోనే విలువైన విడాకులు

ఒక అమ్మాయి సంపన్నురాలు అవ్వాలంటే ఉద్యోగాలు చెయ్యక్కరలేదు ఊళ్ళేలక్కరలేదు. మాంచి సంపన్నుణ్ణి చూసి పెళ్ళిచేసుకొని కొంతకాలం జీవితాన్ని ఎంజొయ్ చేసి విడాకులకు వెళితే సరి. అదే ఒక పెళ్ళైన అబ్బాయి మాత్రం గర్ల్ ఫ్రెండ్ ని పెళ్ళిచేసు కొవాలంటే ముందుగా పెళ్ళాన్ని వదిలించుకొవటానికి భరణం చెల్లించి అతి తేలికగా బికారి కావచ్చు. 



ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ (54), తన భార్య మెకంజీ(48) 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నారు. భార్య మెకంజీ, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో బెజోస్ ప్రకటించిన విషయం తెలిసిందే.


కుబేరుల విడాకులు అనగానే అందరికీ గుర్తొచ్చే అంశం భరణం. ఈ విడాకుల విషయంలోనూ ప్రపంచ కుబేరుడు రికార్డులు నెలకొల్పారు. భార్యకు ఎక్కువ భరణం చెల్లించుకోనున్న వ్యక్తిగానూ అరుదైన రికార్డు బెజోస్ సొంతం చేసుకోబోతున్నారు.

Lauren Sanchez: The TV presenter is Jeff Bezos. new Girl Friend

ప్రపంచ ధనవంతుడైన బెజోస్‌ ప్రస్తుత సంపద విలువ 137 బిలియన్‌ డాలర్లు అంచనా వేస్తున్నారు. అయితే భరణం రూపంలో అమెజాన్ సీఈవో తన భార్య మెకంజీకి సుమారు 65-68 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4.3 లక్షల కోట్లు) చెల్లించనున్నారని సమాచారం. సగం మేర ఆస్తిని విడాకుల నేపథ్యంలో భార్యకు చెల్లించనున్నారు. ప్రముఖ టీవీ యాంకర్‌తో ప్రేమను వైవాహిత జీవితంగా మార్చుకునేందుకు మెకంజీకి భారీ మొత్తంలో నగదును అందజేయ నున్నారు.  దీంతో ఈ విడాకుల డీల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా ఉండనుంది. విడాకులతో మెకెంజీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలిగా మారతారు. అదే సమయంలో ప్రస్తుతం నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న జెఫ్‌ బెజోస్‌ సంపద సగానికి తగ్గిపోవడంతో మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ తర్వాత రెండో స్థానానికి పరిమితం కావొచ్చు. 


ఇప్పటివరకు ఫర్టిలైజర్ బిజినెస్ టైకూన్ డిమిట్రీ రిబోలోవ్లేవ్, ఎలినా రిబోలోవ్లేవ్ జంటదే అత్యధిక భరణం రికార్డ్. భార్య ఎలినాకు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో డిమిట్రీ 4.8 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించుకున్న విషయం తెలిసిందే. 2014లో స్విట్జర్లాండ్ కోర్టు తీర్పు మేరకు ఈ భారీ మొత్తాన్ని మాజీ భార్య ఎలీనాకు డిమిట్రీ చెల్లించుకోవాల్సి వచ్చింది. తాజాగా 65-68 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ విడాకుల భరణంలోనూ తాను ప్రపంచ కుబేరుడినేనని నిరూపించుకోబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: