జగన్ కేసు గురించి మోడీ కి లేఖ రాసిన చంద్రబాబు..!

KSK
టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో విచారణ చేపట్టాలని కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని గతంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల ఏపీ హైకోర్టు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయం లో జరిగిన దాడిని ఉద్దేశించి ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ చేపట్టాలని ఇప్పటిదాకా కేసులో ఉన్న అన్ని ఆధారాలను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు మనకందరికీ తెలిసినదే.


దీంతో తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. వైఎస్‌ జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థక అప్పగించడం పై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు.


జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని అన్నారు. ఆయన 5 పేజీల లేఖను మోడికి రాశారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. మొత్తంమీద ఎన్నికల ముందు జగన్ కోడి కత్తి కేసు ఒక సంచలనం సృష్టించే టట్టు ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: