ఎడిటోరియల్ : చంద్రబాబుపై తలసాని ఎఫెక్ట్

Vijaya

అవును చూడబోతే తెలంగాణా మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎఫెక్ట్ చంద్రబాబునాయుడుపై బాగానే పడినట్లే ఉంది. రెండు రోజుల క్రితం తలసాని ఏపిలో పర్యటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా తలసాని ఏపిలో పర్యటించటం ఎప్పటి నుండో జరుగుతున్నదే. వియ్యంకులింటికో లేకపోతే బంధువులింటికో అదీకాకపోతే కోడి పందేల పేరుతోనో మొత్తానికి తలసాని ఏపిలో పర్యటించటమైతే కొత్తేమీకాదు. కాకపోతే తాజా పర్యటన మాత్రమే రాజకీయ దుమారాన్ని రేపింది. ఏపిలో పర్యటించిన మాజీ మంత్రి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్ ఎంఎల్ఏ కూడా. అటువంటి తలసాని ఏపి పర్యటనలో భాగంగా విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తర్వాత సమస్య మొదలైంది.

 

దుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. తన మీడియా సమావేశంలో చంద్రబాబునాయుడు వైఖరిని దుమ్ముదులిపేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమంటూ జోస్యం చెప్పారు. తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో యాదవ సాయాజికవర్గాన్ని, తమపై అభిమానం ఉన్న వారిని ఓట్లు వేయమని ప్రచారం చేస్తామంటూ హెచ్చరించారు. చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని తేల్చి చెప్పారు. హోలు మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఖాయమంటూ వార్నింగ్ ఇఛ్చేసి చక్కగా హైదరాబద్ కు వెళ్ళిపోయారు.

 

ఏపికి వచ్చి దుర్గగుడి ప్రాంగణంలోనే తలసాని తనకు వార్నింగ్ ఇవ్వటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఆలయ ప్రాంగణంలోనే తనకు తెలంగాణా టిఆర్ఎస్ నేత వార్నింగ్ ఇస్తుంటే ఏం చేస్తున్నారంటూ టిడిపి నేతలపై మండిపోయారు. బంధుత్వాలుంటే ఇంట్లో చూసుకోవాలి కానీ పార్టీకి నష్టం జరిగే విధంగా ప్రవర్తించవద్దంటూ మంత్రి యనమల, టిటిడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సుధాకర్ యాదవ్ తదితరులను తీవ్రంగా హెచ్చరించారు. అంటే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, యనలమ, సుధాకర్ యాదవ్ వియ్యంకులు. అదే విధంగా సుధాకర్ యాదవ్, తలసాని వియ్యంకులు. అంటే పై ముగ్గురూ దగ్గరి బంధువులే అన్న విషయం అర్ధమైంది కదా ?

 

ఎప్పుడైతే తమ వియ్యంకుడు, దగ్గరి బంధువు ఏపి పర్యటనకు వచ్చారో పై ఇద్దరు కలిసి తమ మద్దతుదారులను పురమాయించి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అంటే ఒకరకంగా టిడిపి నేతల ఆతిధ్యాన్ని స్వీకరిస్తూనే చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్నింగులు ఇచ్చారు తలసాని. దాంతోనే చంద్రబాబు అందరిపైన మండిపోయారు. ఇక నుండి టిఆర్ఎస్ నేతలు ఏ స్ధాయిలో ఏపి పర్యటనకు వచ్చినా టిడిపి నేతలెవరూ వారికి ఏ విధంగా కూడా సహకరించేందుకు లేదని హుకూం కూడా జారిచేశారు.

 

సరే అవన్నీ పక్కనపెడితే దుర్గ టెంపుల్ అధికారులపైన కూడా మండిపడ్డారు. తలసాని దుర్గ గుడిచి వచ్చినపుడు ఆలయ మర్యాదలు, ప్రోటోకాల్ ప్రకారం ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలు చేశారు తలసానికి. అదే చంద్రబాబు కోపానికి కారణమైంది. దాంతో ఆలయం ప్రాంగణంలో ఎవరూ రాజకీయాలు మాట్లాడకూడదని, వ్యక్తిగత, వ్యాపారాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదంటూ ఆలయ ఈవో అర్జంటుగా నిషేధాజ్ఞలు విధించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: