ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్

2019 లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ, తన అమ్ములపొదిలోని కీలక అస్త్రాన్ని  సంధించింది. ఎన్నాళ్లు గానో పార్టీ శ్రేణులు కోరుతున్నట్టుగా, మాజీ ప్రధాని ఇందిర గాంధీ మనుమరాలు, రాజీవ్ సోనియాల ప్రియ తనయ ప్రియాంక గాంధీ వాద్రా కి కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, తూర్పు ఉత్తర ప్రదేశ్‌ ప్రచార బాధ్యత లను, ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తూ ఆమె సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అయితే, కాంగ్రెస్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక భారీ వ్యూహమే దాగుnorthన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పీఠాన్ని దక్కించు కోవాలంటే ఉత్తరప్రదేశ్‌ లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాల ను గెలుచుకోవడం చాలా అవసరం. అందుకే ఈసారి యూపీ బాధ్యతలను ప్రియాంకకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేవలం తూర్పు విభాగం బాధ్యతలే అప్పగించినా, ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్య టించే అవకాశం లేకపోలేదు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి, యూపీలో ప్రతిపక్షాలను కట్టడి చేయగల బలమైననేతగా ప్రియాంక ను ఎంచుకొంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ స్టార్ క్యాంపైనర్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు నేరుగా సవాల్ విసిరేందుకే ప్రియాంకను ఇక్కడ రంగం లోకి దించినట్టు కనిపిస్తోంది.

అనారోగ్య కారణాలతో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సైతం, ఈసారి ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా స్థానాన్ని ప్రియాంకతో భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు, సోనియా ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉండడంతో, రాయ్ బరేలీ నుంచి ప్రియాంకను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్  ఈ లెక్కన యూపీలో తనను లెక్కలోకి తీసుకోకుండా పొత్తు పెట్టుకున్న ఎస్పీ-బీఎస్పీలకు, ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి, తన సత్తా ఏంటో? చూపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడ వేసి నట్టు తెలు స్తోంది. ప్రియాంకను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి తీసుకు రావడం ద్వారా యూపీ లో పూర్వవైభవం పొందాలని భావిస్తున్న కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? లేదా? తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.


గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడంలోనూ, అభ్యర్థుల జాబితా తయారుచేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెకు ఒక పదవిని కేటా యించడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో చురుకైన ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించినట్టైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రాను నియమించారు. 2019 ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారు" అని కాంగ్రెస్ పార్టీ ప్రకటనలో పేర్కొంది. 


కీలక బాధ్యతలు చేపట్టినందుకు ప్రియాంక గాంధీకి ప్రముఖ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభినందనలు తెలుపుతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది భారత రాజకీయాల్లోనే సుదీర్ఘ కాలంగా ఎదురు చూసిన సందర్భమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

భారత రాజకీయాల్లోనే అత్యంత సుదీర్ఘ కాలంగా ఎదురు చూసిన సందర్భం ఎట్టకేలకు వాస్తవ రూపం దాల్చింది. ఆమె వచ్చిన సమయం, కచ్చితమైన పాత్ర, స్థానంపై సర్వత్రా చర్చిస్తు న్నారు. అయితే నా వరకు నిజమైన వార్త ఏమంటే.. రాజకీయాల్లోకి దూకాలని ఆమె ఎట్టకేలకు ఎట్టకేలకు నిర్ణయించుకున్నారు. ప్రియాంక గాంధీకి అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: