రిపబ్లిక్ డే : ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు!

siri Madhukar
గణతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.  గత కొంత కాలంగా భారత దేశంలో ఉగ్రవాదులు అలజడి బాగా పెరిగిపోయింది. గత సంవత్సరం సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టించారు భారత సైనికులు. అయినా వీరి వక్రబుద్ది మాత్రం మారడం లేదు..ఎలాగైనా భారత దేశంలో బాంబుల కలకలం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 

తాజాగా జైసే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు  రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసం వ్యూహాలు పన్నుతున్నారన్న విషయం తెలుసుకున్న మిలటరి ఇంటెలిజెన్స్ పోలీసులకు  సమాచారం అందించారు.  వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు లక్ష్మీనగర్‌లో ఓ ఉగ్రవాదిని, బందీపోరాలో మురో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అబ్ధుల్ లతీఫ్ ఘనీ, అహ్మద్ భట్‌గా గుర్తించారు. పేలుడు పదార్థాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్లాన్  కి సిద్దమయ్యారు.

ఢిల్లీలో దాడి కుట్రలో వీరిద్దరే ఉన్నారా? మిగతా నగరాల్లోనూ ఈ ఉగ్రసంస్థ దాడులకు కుట్ర పన్నిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు చెబుతామన్నారు. ఉగ్ర కదలికల దృష్ట్యా దేశరాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: