ప్రజాజీవితం లోకి వస్తేనే చీల్చి చండాడుతాం! ఏమైనా అంటాం! అంటారు మహాకవి శ్రీ శ్రీ

అందముంది, ట్యాలెంట్ లేదు! ప్రియాంక గాంధి ట్రంప్ కార్డ్ అయితే, రాహుల్ గాంధి జోకరా?’  ప్రియాంక గాంధీకి ఆ భగవంతుడు చాలా అందం ఇచ్చాడు (నాయనమ్మ ఇందిరా గాంధి లాగా) అయితే ఆమెకు ట్యాలెంట్ లేదని (ఆమెలాగా మాత్రం యివ్వలేదు) బీహార్ మంత్రి బీజేపీ సీనియర్ నేత వినోద్ నారాయణ్ ఝా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రత్యక్ష రాజ కీయాల్లో ఆమె అడుగు పెట్టిన మరుక్షణం ప్రియాంక గాంధీ పై వివాదాస్పద కామెంట్స్ మొదలయ్యాయి. రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి అనుభవం లేదని ఎద్దేవా చేశారు. ఈస్ట్ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీ రెండ్రోజుల క్రితం నియమితులు కావడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆమెకు గరిష్ఠంగా 44ఏళ్ల వరకు ఉండొచ్చు. అయితే ఇప్పటివరకు రాజకీయాల్లో ఆమె సాధించిందేమీ లేదు. చూసేందుకు మాత్రం ఆమె అందంగానే ఉంటుంది దేవుడు ఆమెకు అందం ఇచ్చాడు. అయితే ఆ అందంతో ఆమె రాజకీయాల్లో ఏమి చేయగలుగుతుంది? అంటూ వినోద్ నారాయణ్ ఝా ప్రశ్నించారు.  అందాన్ని చూపి ఓట్లను సాధించ లేరని వ్యాఖ్యానించారు.

పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాకు ఆమె భార్య కదా! అంటూ ఎద్దేవా చేశారు, ప్రియాంక గాంధీ పై బీహార్ మంత్రి చేసిన ఈ కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి.

అయితే మరోవైపు కళంకితుడి జీవిత భాగస్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసు కుంటోందని బీజేపీ సీనియర్ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సునీల్ కుమార్ మోడీ ఎద్దేవా చేశారు.



ప్రజా జీవితంలోకి వస్తే ఎవరినైనా ఎమైనా అంటాం రాజకీయాల్లోకి రాకముందు మీ జీవితం మీది పబ్లిక్ లోకి వచ్చాక ఏమైనా అంటాం! అన్న శ్రీ శ్రీ మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలిక్కడ. అదే జరిగిందిక్కడ. ప్రియాంక గాంధి రాజకీయ రంగ ప్రవేశ ప్రకటనే ఆమెపై సెటైర్లకు కారణమంటున్నారు.

ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క! అయితే, రాహుల్ గాంధీ జోకరా? అంటూ బీజేపీ ఎంపీ పరేష్ రావల్ ఎద్దేవా చేశారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా బాగా తెలిసిన  కమెడియన్, కారక్టర్ యాక్టర్ బీజేపీ ఎంపీ పరేష్ రావల్, కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్ వేశారు. అందులో కూడా తన ట్రేడ్-మార్క్ కామెడీ ఉండేలా చూసుకున్నారు.

ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడంతో ఆమెను అందరూ కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క అంటున్నారు. దీనిపై పరేష్ రావల్ పంచ్ వేశారు. ప్రియాంకా గాంధీ తురుపుముక్క అని వాళ్లు చెబుతున్నారు. వారిని ఓ ప్రశ్న అడగాలను కుంటున్నా. ప్రియాంక తురుపుముక్క అయితే, ఇన్నాళ్లూ కాంగ్రెస్ వాళ్లు జోకర్‌ తో ఆడారా? అని ప్రశ్నించారు. పరేష్ రావల్ పరోక్షంగా రాహుల్ గాంధీ జోకరా? అని ప్రశ్నించారు.

2014 ఎన్నికల్లో అహ్మదాబాద్ తూర్పు లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పరేష్ రావల్ గెలుపొందారు. బాలీవుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ లో కూడా ఆయన నటుడిగా మంచి పేరు తెచ్చు కున్నారు. గతఏడాది #JootiCongress  అంటూ ఒక క్యాంపెయిన్ నిర్వహించాలంటూ యువతకు సూచనలుఇస్తూ ఒక గూగుల్ డాక్యుమెంట్‌ను ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివాదాస్పద మైంది. అయితే, అప్పటికే అది వైరల్‌గా మారింది.


చివరగా ప్రియాంక  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్‌ యత్నిస్తోందని, బైపోలార్‌ డిజార్డర్‌ తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయ లేరని ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోను కావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్డర్‌గా పిలుస్తారు.



ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. . 



ఇక బీజేపీ మరో నేత కైలాష్‌ విజయ్‌వర్జియా, "కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవు లు కట్టబెట్టారు. చాకొలేట్‌ ఫేస్‌లతో వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొందామని  కాంగ్రెస్‌ నేతలు కలలుగంటున్నారు" అని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: