తెలుగు రాజకీయాలలో సంచలనం జగన్ తో దగ్గుబాటి కుటుంబం..!

KSK
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో రాబోయే ఎన్నికలలో జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలలో తేలడంతో చాలామంది ప్రముఖులు రాజకీయ నేతలు ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసిపి పార్టీ లోకి రావడానికి క్యూ కడుతున్నారు.


ఇదిలా ఉండగా తెలుగు రాజకీయాలలో ప్రముఖ కుటుంబమైనా దగ్గుబాటి కుటుంబానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు మరియు ఆయన కుమారుడు హితేష్‌ చెంచురాము తాజాగా లోటస్ పాండ్ లో జగన్తో భేటీ అయ్యారు.


రాబోయే ఎన్నికలలో హితేష్‌ చెంచురాము నీ ఎన్నికల బరిలోకి దింపాలని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేయించే ఆలోచన లో ఉన్నారని సమాచారం. మరోపక్క హితేష్‌ తల్లి పురందేశ్వరి బీజేపీ పార్టీలో ఉన్న క్రమంలో తాజాగా కొడుకు మరియు తండ్రి వైసీపీ పార్టీ అధినేత జగన్ ని కలవడం తో తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త సంచలనం అయింది.


అయితే దగ్గుబాటి కుటుంబం వైసిపి పార్టీతో రాబోయే భవిష్యత్తు రాజకీయాలలో అడుగులు వేస్తున్న క్రమంలో ఇది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఎక్కువ తలనొప్పులు తీసుకు వచ్చే ఎపిసోడ్ గా మారే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఏది ఏమైనా ఎన్నికల ముందు దగ్గుబాటి కుటుంబం వైసీపీ పార్టీలోకి వెళ్లడంతో కచ్చితంగా ఈ పరిణామం వైసీపీ పార్టీ కి కలిసి వచ్చే అవకాశం అని కూడా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: