ఫిబ్రవరి 14 : తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు ...!

Prathap Kaluva

అందరికి ఫిబ్రవరి 14 అనగానే వాలంటైడ్స్ డే గుర్తుకు వస్తుంది. అయితే ఆ రోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజే జగన్ తన కొత్త ఇంటికి మారబోతున్నాడు. ఆ ఇంటి ప్రారంభోత్సవానికి కేసీఆర్ రాబోతున్నాడు. ఆ రోజే చంద్ర బాబు కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు తెరవెనక ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది.


ఈ సందర్భంగా బాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పై కేసీఆర్, స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అది కూడా అమరావతి కేంద్రంగా. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించిన రోజు నుంచి చంద్రబాబుకు ఒకటే భయం పట్టుకుంది. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. కేసీఆర్ ఒక కేసుపెడితే తాము 3 కేసులు పెడతామంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. జగన్-కేసీఆర్ పొత్తును అపవిత్రమైనదిగా చెప్పేందుకు అను'కుల' మీడియాతో అపసోపాలు పడుతున్నారు.


కానీ బాబు వ్యవహారశైలి జనాలకు అర్థమైంది. జగన్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ ఐదేళ్లలో ఇచ్చిన మాటపై జగన్ నిలబడిన తీరుచూసి ప్రజలు ముచ్చటపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ స్టామినా ఏంటో కూడా అందరూ చూశారు. దీనికితోడు ప్రత్యేకహోదాకు అనుకూలంగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానంటూ కేసీఆర్ ప్రకటించి, ఆంధ్రా ప్రజల మెప్పుపొందారు. సో.. ఈసారి బాబు పప్పులు ఉడకలేదు. 14న అమరావతి రానున్న కేసీఆర్, అదేరోజు కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: