ఎడిటోరియల్ : చంద్రబాబు ఉచ్చులో నుండి తప్పించుకున్న పవన్

Vijaya

చంద్రబాబునాయుడు ఉచ్చులో పడకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త పడుతున్నట్లు అర్ధమవుతోంది. ప్రత్యేకహోదా, రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్రపై పోరాటం చేసేందుకు చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి హాజరు అయ్యేది లేదని పవన్ కుండబద్దు కొట్టినట్లు చెప్పారు. గతంలో కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఇటువంటి సమావేశానికి ప్రతిపక్షాల నుండి ఎవరూ హాజరు కాలేదన్న విషయం గుర్తుండే ఉంటుంది. అంటే మళ్ళీ ఇపుడు కూడా పవన్ తో పాటు వైసిపి, సిపిఎం, బిజెపిలు తాము సమావేశానికి హాజరయ్యేది లేదంటూ ప్రభుత్వానికి లేఖలు రాసి పెద్ద షాకే ఇచ్చాయి.

 

వైసిపి అంటే మొదటి నుండి వ్యతిరేకిస్తోంది కాబట్టి ఈరోజు సమావేశానికి కూడా హాజరవుతుందని ఎవరూ అనుకోలేదు. బిజెపి కూడా ఎటూ వెళ్ళదని అందరికీ తెలుసు. ఎటు తిరిగి పవన్ ఏం చేస్తారన్నది అందరిలోను ఆసక్తిని పెంచింది. దానికి పులిస్టాప్ గానే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేది లేదని పవన్ స్పష్టంగా లేఖ రాయటంతో టిడిపి నేతలు డిజపాయింట్ అయ్యారు.

 

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే పవన్ తో పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు తెగ ఆరాటపడిపోతున్నారు. ఒంటిరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యంలేని చంద్రబాబు పవన్ తో పొత్తులపైనే ఆశలు పెట్టుకున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకునేది లేదని పవన్ పదే పదే చెబుతున్నా చంద్రబాబు మాత్రం గోకుతునే ఉన్నారు. గోకుడు చివరి అంకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని వేదికగా చేసుకోవాలని చంద్రబాబు అనుకున్నట్లు సమాచారం.

 

టిడిపితో పొత్తు పెట్టుకునేది లేదు మొర్రో అని పవన్ ఎంత మొత్తుకుంటున్నా చంద్రబాబు వినటం లేదు. ఒకరకంగా పవన్ ను చంద్రబాబు ర్యాగింగ్ చేస్తున్నట్లుగానే ఉంది. పవన్ మనతోనే ఉంటాడు, పవన్ మనోడే ఏమనద్దు, మార్చిలో టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు లాంటి ప్రకటనలు చంద్రబాబు అండ్ కో నుండి వచ్చిన విషయం తెలిసిందే. అంటే ఓ పద్దతి ప్రకారం పవన్ ను తన ఉచ్చులో బిగించేందుకు చంద్రబాబు పెద్ద వ్యూహమే పన్నినట్లు అర్ధమవుతోంది. అందులో నుండి బయటపడేందుకు పవన్ నానా అవస్తలు పడుతున్నారు.

 

అందుకే చంద్రబాబు, టిడిపి నేతల వైఖరితో జనాల్లో తన పార్టీ ఇమేజి దెబ్బతింటోందని పవన్ గ్రహించినట్లున్నారు. అందుకనే చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకించకపోతే వస్తుందనుకుంటున్న నాలుగు సీట్లు కూడా రాదన్నది బాగా అర్ధమైపోయింది. అదుకనే చంద్రబాబుకు పవన్ పూర్తిగా దూరం పాటిస్తున్నారు. హోదా కోసం ప్రతిపక్షాలు చేసిన ఆందోళనలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన చంద్రబాబు తో సమావేశం కాలేమని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు హోదా కోసం తానే పోరాటం చేస్తున్నానంటూ బిల్డప్ ఇద్దామని అనుకున్న చంద్రబాబు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: