రాహుల్ జీ! మీ వ్యక్తిత్వం ఇంత నీచమా!

రాహుల్ గాంధి నైతికత ప్రశ్నార్ధకమౌతుంది. ఆయన అంతరంగం, స్వభావం, నడవడి, నిజస్వరూపం క్రమంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బహిర్గతం ఔతున్నాయి. బహుశ ఙ్జానమున్న ప్రతిపక్ష నాయకుడేవరైనా రాహుల్ గాంధిని తమ ఇంటికి స్వాగతించక పోవచ్చు. ఆయన వస్తే దాని పర్యవసానం గౌరవప్రదంగా ఉండని భావించే పరిస్థితులు నెలకొంటాయి. 


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై గోవా ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసే సాకుతో వచ్చి, దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. తనతో రాహుల్ గాంధి మాట్లాడినపుడు రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు.


చాలా కాలం నుంచి "పాంక్రియాటిస్" సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ మంగళవారం సందర్శించిన సంగతి తెలిసిందే. కొచ్చిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధి మాట్లాడుతూ తాను గోవా ముఖ్యమంత్రి పారికర్‌ తో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి మాట్లాడినట్లు తెలిపారు. తనకు ఈ ఒప్పందంలో ప్రమేయం లేదని పారికర్ స్పష్టంగా చెప్పారన్నారు. రిలయెన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేశారని రాహుల్ ఆరోపించారు.


దీనిపై మనోహర్ పారికర్ స్పందిస్తూ బుధవారం లేఖ రాశారు. తాను రాహుల్ గాంధీతో ఆరోగ్యకరమైన రాజకీయ స్ఫూర్తితో మాట్లాడినట్లు తెలిపారు. *మీరు నా కార్యాలయానికి రావడంపై మీడియా కథనాలను చదివిన తర్వాత నాకు బాధ కలిగింది. మీరు ఈ సందర్శనను చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం నన్ను బాధించింది.


*మీరు నాతో గడిపిన 5 నిమిషాల్లో మీరు నాతో రఫేల్ గురించి ఏమీ మాట్లాడలేదు, దానికి సంబంధించిన దేని గురించి కూడా చర్చించలేదు. రఫేల్ గురించి ఏమీ ప్రస్తావించలేదు అని పారికర్ పేర్కొన్నారు.

*మర్యాద పూర్వకంగా కలవడం, ఆ తర్వాత చిల్లర రాజకీయాల కోసం తప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి మరీ హీనాతి హీన నిమ్న స్థితికి దిగజారడం,

*ఇదంతా చూసిన తర్వాత నా మనసులో మీ సందర్శన వెనుక నిజాయితీ, ఉద్దేశాలపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అని పారికర్ పేర్కొన్నారు. ఇ

*టువంటి చాణక్యాలను ప్రాణాపాయకరమైన వ్యాధితో పోరాడుతున్న వ్యక్తి విషయంలో ఉపయోగించకూడదని తెలిపారు.

రఫేల్ ఒప్పందంపై తాను గతంలో చెప్పిన విషయాలనే మళ్ళీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చెప్పాలని అనుకుంటున్నానని పారికర్ చెప్పారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, అన్ని నిర్దేశిత విధానాలను అనుసరిస్తూ యుద్ధ విమానాలను కొంటున్నామని తెలిపారు.


సొనియా గాంధి కూడా ఇంతటి ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతున్న సందర్భంలో రాహుల్ ఇలా చేయటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. భారత ప్రధాని కావలసిన వ్యక్తి ఇలా ఉంటే దేశం ప్రపంచం దృష్టిలో పలచన అవకతప్పదు.  


మన సమకాలీన సమాజంలో మనతో ఉన్న అతి నిజాయతీ పరుడు అంటారు తెలిసిన వారు. అత్యంత నిరాడంబరుడు, నిగర్వి,  విద్యావంతుడు,  అజాతశత్రువు అని గుర్తించబడ్డ వ్యక్తిగా మనోహర్ పారికర్ పేరుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: