యుఎస్ లో వందలాది భారతీయులు - ప్రత్యేకించి తెలుగువాళ్లు అరెష్ట్ - మన నిజాయతీ సంశయాస్పదం

గతంలో ఒక సారి చికాగో పోలీసులకు సెక్స్-రాకెట్ లో చిక్కుకొని జాతి పరువు ప్రతిష్ట నగ్నంగా తీసేసిన మన తెలుగు సినిమావాళ్ళ సంఘటన తరవాత నేడు మిచిగాన్ స్టేట్ లోని డెట్రోయిట్ లో యుఎస్ డీహెచ్‌ఎస్‌ వలలో 200పైగా మనవాళ్ళు ఇరుక్కోగా ప్రత్యక్షంగా 8 మంది నకిలీ ధృవపత్రాల జారీలో నేరస్తులుగా మిగిలిపోయారు. 

అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్‌ రాష్ట్రంలో ఒక ఫేక్‌ యూనివర్సిటీని సృష్టించి సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (యుఎస్ డీహెచ్‌ఎస్‌) అదుపులోకి తీసుకుంది. 


అసలు కథ:

అమెరికాలో విద్య, ఉపాధి, అవకాశాలకోసం వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్న వానిని గుర్తించడానికి యుఎస్ ప్రభుత్వం నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది.  2015 లో ఏర్పాటైన యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌ లో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషాల్లో ఉద్యోగులు గా చేరారు. 


ఈ క్రమంలో విద్యార్థులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు (దొంగ సర్టిఫికేట్లు) సృష్టించి వారిని అక్కడ నివసించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న ఉద్యోగులు పలువురిపై హోంల్యాండ్ సెక్యూరిటీ నిఘా పెట్టారు. ఈ ఆపరేషన్‌లో 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8 మంది తెలుగు వారిని గుర్తించారు. నేరాలను గుర్తించేందుకు వారి నేరాలను  నిరూపించేందుకు ఏకంగా ఒక నకిలీ యూనివర్సిటీ నెలకొల్పింది ఆ దేశపు నిఘా వ్యవస్థ. 


దీంతో 200మంది తెలుగు విద్యార్థులు చిక్కుల్లో పడగా, ఈ వ్యవహారంలో గురువారం ఉదయం 20 మంది తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా మాస్టర్స్ చేసి హెచ్1బీ కోసం నిరీక్షిస్తున్న వారే.


అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మంది తెలుగు వారు:


* భరత్ కాకిరెడ్డి, లేక్ మేరీ (ప్లోరిడా-29)
* అశ్వంత్ నూనె, (అట్లాంటా-26)
*సురేశ్ రెడ్డి కందాల, (వర్జీనియా-31)
*ఫణిదీప్ కర్నాటి, (కెంటుకీ-లూసివిల్లె-35)
* ప్రేమ్ కుమార్ రామ్‌ పీసా (నార్త్ కరోలినా , చార్లెట్ -26)
* సంతోష్ రెడ్డి సామా, (కాలిఫోర్నీయా-28)
* అవినాశ్ తక్కెళ్లపల్లి, (పెన్సుల్వేనియా- హర్రీస్‌బర్గ్ -28)
*నవీన్ ప్రత్తిపాటి, (డల్లాస్-29)

The University of Farmington's headquarters was in this office building on Northwestern Highway north of Inkster Road in Farmington Hills. 


సరైన ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకు వచ్చారనే అభియోగాలతో పై ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డెట్రాయిట్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఉన్న మరో 14 మంది తెలుగు విద్యార్థులను కూడా అరెస్టు చేశారని, వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది.  అక్రమ వలసదారులకు అడ్మిషన్‌ పేరిట గాలం వేశారు. ఉన్నత విద్య పేరిట నకిలీ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించి.. అక్రమంగా నివసిస్తున్న వారిని టార్గెట్‌ చేసుకొని వారు ఆపరేషన్‌ నిర్వహించారు. 


ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో విద్యార్థుల పేరిట నమోదైన అక్రమ వలస దారుల గుట్టు బట్టబయలైంది. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి హెచ్‌ 1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా ఉండడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల విచారణలో నకిలీ మాస్టర్స్‌ డిగ్రీలతో కొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: