మోడీ బ్రహ్మాస్త్రం ఎందరికి షాకిస్తుంది?

తన ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే చివరి కేంద్ర బడ్జెట్ లో నరేంద్ర మోడీ నమో నమః అంటూ సంక్షేమ మంత్రం పఠించారు. ఎన్నికల ముంగిట్ల ఒక్కసారిగా గ్రామీణ రైతాంగం, మధ్య తరగతి, కార్మిక కర్షకులు, యువత, విధ్యార్ధులు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే పథకాలను ప్రకటించింది మోడీ సర్కారు.


ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి నిధిని సమకూరుస్తామని ప్రకటించారు. ఇది రైతులను ఆకట్టుకునేందుకు సాధారణ బడ్జెట్ ద్వారా చేసిన ప్రయత్నమే. ప్రత్యేకించి ఉత్తరాదిన ఈ పథకం "బీజేపీకి పొలిటికల్ మైలేజీ" ని ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


ఎన్నికల ముంగిట్లోనే దేశ వ్యాప్తంగా ఐదెకరాల్లోపు భూములున్న రైతులందరికీ రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు అందనున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ పథకంతో పన్నెండు కోట్ల మంది రైతుల కుటుంబాలకు మేలు జరిగేలా ఆయా రైతుల ఖాతాల్లోకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ సొమ్మును జమ చేయనుంది.   ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇలా చేయూతను ఇవ్వడం రైతులకు భరోసానే అవుతుంది. ఇది నరేంద్ర మోడీకి మళ్లీ అవకాశం ఇవ్వడానికి ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు.


ఇక నగరాల్లోని మద్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేఅస్తూ, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది. ఇన్నాళ్లూ సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలకు మించి ఆదాయం పొందే వాళ్లంతా ఆదాయపన్ను కట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచింది. దీంతో అనేక మందికి మినహాయింపు వర్తిస్తుంది. ఇన్-కమ్-టాక్స్ భారం చాలా వరకు తగ్గుతుంది.


అలాగే ఇరవై ఒక్క వెయ్యి రూపాయల్లోపు ఆదాయం పొందే వారికి కూడా పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా సంక్షేమ మంత్రాన్ని వేశారు. ఎన్నికల ముందు వీటి ప్రభావం ఎలా ఉంటుందో దీని ప్రభావం ఏ మాత్రమో ఎన్నికల ఫలితాలను బట్టి తేలుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: