అప్పటి నుంచి జగన్ ఆపరట....!!

Satya
వైఎస్ జగన్ ఇపుడు ఏం చేస్తున్నారు. పాదయాత్ర ముగిసి దాదాపుగా నెల రోజులవుతోంది. జగన్ ముఖం చూసి చాలాకాలం అయిందని ఓ వైపు టీడీపీ మంత్రి జవహర్ లాంటి వారు సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు ఏపీలో రాజకీయం వేడెక్కిపోతోంది. పధకాల మీద పధకాలతో బాబు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు.


అమరావతి నుంచే :


ఇక వైఎస్ జగన్ అమరావతి నుంచి తన రాజకీయ పోరాటాన్ని మొదలుపెడతారని తెలుస్తోంది. ఈ నెల 14న ఆయన గుంటూర్ జిల్లాలో కట్టించుకున్న కొత్త ఇంటికి గ్రుహప్రవేశం ఉంది. ఈ లోగా బూత్ కమిటీలతో జగన్ ముఖా ముఖీ కూడా ఉంది. ఈ విధంగా ఫిబ్రవరి నెలంతా బిజీగా ఉండే జగన్ మార్చి నుంచి తన కార్యకలాపాలను ప‌రుగులెత్తిస్తారని టాక్. మొత్తం ఏపీని, రాజకీయాన్ని తన వైపుగా తిప్పుకునేందుకు పదునైన వ్యూహాలను రూపొందించుకున్న జగన్ దాన్ని పక్కాగా అమలుచేసేందుకు రెడీ అవుతున్నారు.


ఆ బస్సు ఇక ఆగదు:


మార్చ్ నుంచి జగన్ బస్సు యాత్ర మొదలు కాబోతోంది. ఏకబిగిన ఏపీవ్యాప్తంగా జగన్ యాత్ర సాగుతుందని, ప్రచారం ముగిసేంతవరకూ జగన్ జనంలోనే ఉండేలా నాన్ స్టాప్ ప్రోగ్రాం రెడీ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు. జగన్ బస్సు యాత్రలోనే క్యాండిడేట్లను డిసైడ్ చేస్తారట. ఇక పాదయాత్ర చేసిన చోట్ల కూడా జగన్ బస్సు తిరుగుతుందట. మొత్తానికి జగన్ బస్సు యాత్ర వైసీపీని అసెంబ్లీకి తీసుకువెళ్ళాల సాగుతుందని, జగన్ ఈ సంధర్భంగా ఎన్నికల హామీలను కూడా ప్రకటిస్తారని, అలాగే ఎన్నికల ప్రణాలికను కూడా సిధ్ధం చేశారని అంటున్నారు.
జగన్ ఇపుడు పార్టీ మీటింగుల్లో బిజీగా ఉన్నారని, రేపటి రోజున జనంలో ఉంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి జగన్ రాకతో ఏపీ రాజకీయం మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: