నా కంటే పిల్లలే బెటర్ : చంద్రబాబు

Chakravarthi Kalyan

రాజకీయాలను పక్కన పెడితే ఏపీ సీఎం చంద్రబాబులో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన నిత్య విద్యార్థి.. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతారు. వ్యవస్థలను టెక్నాలజీతో మార్చేందుకు సిద్దంగా ఉంటారు. ప్రయోగాలు చేసేవారిని ప్రోత్సహిస్తారు.



కానీ చంద్రబాబుకు ఉన్న మైనస్ పాయింట్లలో భాష ఒకటి. ఆయన ఇంగ్లీష్ అనర్ఘంళంగా మాట్లాడలేరు. ఆయన ఇంగ్లీషు మాట్లాడుతుంటే తెలుగు విన్నట్టే ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన కూడా స్వయంగా అంగీకరిస్తారు కూడా. ఇటీవల ఆయన ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఈ చర్చ జరిగింది.



అక్కడ విద్యార్థులు అనర్ఘళంగా ఇంగ్లీషు మాట్లాడటం చూసి చంద్రబాబు ఆశ్చర్యపోయారు.ఆ విషయాన్ని వేదికపైనే వారితో పంచుకున్నారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. వారి ఇంగ్లీష్ వింటే నాకంటే వారు చాలా బెటర్ గా మాట్లాడుతున్నారు. అంటూ ప్రోత్సహించారు చంద్రబాబు.



అయితే తాను ఏ విషయంలోనైనా నిత్య విద్యార్థిగా ఉంటానని విద్యార్థలకు చంద్రబాబు చెప్పారు. ఏపీని నాలెడ్జ్ స్టేట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు నిత్యం కష్టపడాలని విద్యార్థులకు సూచించారు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: