బాబు ఆ పని చేస్తే జగన్ ఫినిష్..? చేయకపోతే బాబే ఫినిష్..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణ చేశారు ప్రతిపక్షనేత జగన్. పోలీసు శాఖలో కీలకమైన పోస్టులను తన కులం వారితో నింపుతున్నారని తీవ్రమైన విమర్శలు చేశారు. ఇందుకు సాక్ష్యంగా ఓ జాబితాను జగన్ విడుదల చేశారు.



మరి ఈ జాబితాలో ఉన్నది వాస్తవమేనా.. నిజంగా 37 మందిలో 35 మంది కుమ్మవారికే ప్రమోషన్ ఇచ్చారా.. అది నిజంకాకపోతే జగన్ అబద్దం చెప్పారా.. ఈ విషయాలు తేలాల్సి ఉంది. జగన్ ఆరోపణలపై డిల్లీలో స్పందించిన చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు.



తన ప్రభుత్వంలో నలుగురు రెడ్లు ఉన్నారని.. సామాజిక న్యాయం చేయడంలో తాను ముందుటానని చెప్పారు తప్ప.. జగన్ ఇచ్చిన జాబితా తప్పు అనే ప్రయత్నం చేయలేదు. ఒక వేళ చంద్రబాబు ఆ పని చేయగలిగితే జగన్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. ఏపీ సమాజంలో కుల చిచ్చు రేపేందుకు జగన్ కుట్ర పన్నాడని రుజువు అవుతుంది.



మరి చంద్రబాబు ఆ ప్రయత్నం చేయకపోతే.. అది చంద్రబాబుకే దెబ్బ అవుతుంది. నిజంగా 37 మందిలో 35 మంది కమ్మవారికే ప్రమోషన్ ఇచ్చి ఉంటే.. చంద్రబాబు కుల గజ్జికి ఇంతకు మించిన సాక్ష్యం వేరే ఏముంటుంది..? ఓ కులానికి ఇచ్చిన ప్రాధాన్యం మిగిలిన కులాల్లో అంశాంతి రేపే అవకాశం ఉంటుంది. అది ఓట్ల రూపంలో బయటపడే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: