చంద్ర "జ్యోతి"ని ఓ ఆటాడుకున్న నాగబాబు.. అల్టిమేట్ కామెడీ..?

Chakravarthi Kalyan
తెలుగులోని టాప్ మీడియా హౌజుల్లో ఒకటైన సదరు సంస్థ.. చంద్రబాబుకు బాకా ఊదుతుందన్నది బహిరంగ రహస్యమే.. చంద్రబాబు, లోకేశ్‌లను తరచూ ఆకాశానికెత్తేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలదని ఆ పత్రిక, ఛానల్ గురించి తెలిసిన వారు చెబుతుంటారు.



ఇటీవల నారా లోకేశ్ దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన ఓ కుబేరుడిని కలిశారని.. ఆయన ఏపీలో పెట్టుబడి పెడతానని చెప్పారని ఓ కథనం ఆ మీడియా హౌజ్ ఛానల్ నుంచి వచ్చింది. ఆ కథనంలో ఎప్పటిలాగానే లోకేశ్ ను, చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.



ఇప్పుడీ కథనంపై నాగబాబు సెటైర్లు గుప్పించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటీవల నాఛానెల్ నా ఇష్టం అంటూ చాకిరేవు కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో ఈ కథనం ప్రసారం చేస్తూ వారిని ఎండగట్టారు. భజన చేసే తాళాలు వాయిస్తూ నాగబాబు చెప్పిన కామెంటరీ కడుపుబ్బ నవ్విస్తోంది.



ఆయన ఆ పోస్ట్ లో నేరుగా ఆంధ్రజ్యోతి పేరునూ, ఏబీఎన్ చానల్ పేరునూ, దాని ఎండీ రాధాకృష్ణ పేరునూ ప్రస్తావిస్తూ వారి భజన తీరును ఏకిపారేశారు నాగబాబు. పాపం.. ఆ మీడియా ఇలాంటి అభిప్రాయం ఎందరికో ఉన్నా.. ఇప్పుడు నాగబాబు దాన్ని ప్రపంచానికి చాటాడన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: