హైదరాబాద్ లో చంపేసి అమరావతి లో పారేస్తె ఫినిష్! రాష్ట్ర పోలీస్ పైనే నమ్మకం పోయిందా?

ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు - కేసును తెలంగాణకు బదిలీ చేయండి ఈ మాట లేదా దగ్గర దగ్గరగా ఇలాంటి  మాటే గతంలో ఎక్కడో బలంగా విన్నట్లుంది కదూ!  గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేయండి! ఒక నాడు విశాఖ విమానా శ్రయం లో ఏపి ప్రతిపక్ష నేత వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పై హత్యాయత్నం జరిగిన సందర్భంలో ఆయన, ఆయన అనుయాయులు అన్న సందర్భం అలాగే ఉంది కదా! సరే ఆయనంటే ప్రతిపక్ష నాయకుడు ఏదో రాజకీయం చేస్తు న్నాడని తెలుగుదేశం వాళ్ళు సమర్ధించుకోవచ్చు. 

మరి ఇప్పుడు ఒక ప్రవాసి తన భర్త మరో ప్రవాస ఆంధ్రుణ్ణి హత్య చేసిన నేరగాళ్లని పట్టుకొని శిక్షించమని అంటు న్నారు. అదేమంత పెద్ద గొంతెమ్మ కోరికనా! నేర విచారణ ఆ నేర భాదితులకు సంతృప్తి మేరకు జరపక పోవటం న్యాయమౌతుందా? మరిప్పుడు ఏమందాం? రాష్ట్రంలో పాలన ఉందా? సామాన్యునికి ప్రభుత్వం అంటే పోలీసులు. కాని ఆ పోలీస్ వ్యవస్తే ఏపిలో రుజాగ్రస్థ స్థితిలోకి జారిపోయింది. భాదితులకు ఇక్కడ స్వాంతన లభించదని నిర్ణయమైంది మరోసారి.

జగన్మోహనరెడ్డిపై హత్యాప్రయత్నం చేసిన అరగంటలోనే స్వయాన రాష్ట్ర పోలీస్ బాస్ చేసిన హుందాతనంలేని వ్యాఖ్య సాధారణ ప్రజలని సైతం కలవర పరిచింది. వెంటనే ముఖ్యమంత్రి సైతం తన స్థాయికి తగని విధంగా వెటకారం చేశారు. జగన్మోహనరెడ్డి చంద్రబాబుకు శత్రువు కావచ్చు తెలుగు వారందరి మాత్రం కాదన్న విషయం మరవరాదు. అందులో ఏ రాజకీయాలు పట్టని తటస్థులు కూడా ఉండవచ్చు. అది నిజంగా ప్రజల్లో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

రాష్ట్రం ఇలా తగలడితే రాష్ట్రపాలన గాలికి వదిలేసి ఎక్కడో మరో బాధ్యత మరచిన ముఖ్యమంత్రికి సహాయం చేయటానికి వెళ్ళటం ఎందుకు? చిన్న రాష్ట్ర పాలన చేతగాని నలభైయేళ్ళ సుధీర్ఘ రాజకీయానుభవం ఉన్న ఎకైక భారత రాజకీయ నాయకుడు కేంద్రంలొ చక్రం తిప్పుతారట! అంటూ జనం వెటకారం చేస్తున్నారు.   

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో అనుమానాలు ఉన్నాయని జయరామ్ సతీమణి పద్మశ్రీ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తను దారుణంగా హత్య చేశారన్న ఆమె, తనకు న్యాయం కావాలన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి, ఏపీ పోలీసులను ప్రభావితంచేసి ఉండొచ్చన్న ఆమె,  కావాలనే కేసును హైదరాబాద్ పరిధి నుంచి దాటించారని ఆరోపించారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతామని హామీఇచ్చారు. ఈ కేసులో రాకేశ్‌ రెడ్డితో పాటు మరికొందరి హస్త ముందని పద్మశ్రీ ఆరోపిస్తున్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రోద్బలంతోనే హత్య జరిగిందని అంటున్నారు. మేనమామ హత్య చెయబడ్దట్టు తెలిసిన మేనకోడలు అదాటున వచ్చినషాకుతో ముందు చేయాల్సిన పనేమిటని? ఆమె ప్రశ్నించారు.

ముందుగా మరణించిన మెనమామ మృతదేహం దగ్గరికో!  లేక తక్షణమే పోలీసుల వద్దకో! పరుగెత్తాలి అదీ వేదనతో!  అలా జరిగిందా? మా యింటికి వెళ్ళి వాచ్మన్ తో గొడవ పెట్టుకొని మా ప్రైవసీ గదుల్లోకి ప్రవేసించి అల్మైరాలు బ్రేక్ చేసి వెతుకులాడి ఏదో తీసుకునివెళ్ళటాన్ని పరిశోధనలోకి తీసుకోని పోలీసుల నేరవిచారణ విధానాన్ని ప్రశ్నించకనే ప్రశ్నించారు బాధితురాలు పద్మశ్రీ.

అసలు ఈ కేసులో కీలక నేరస్తురాలుగా కనిపిస్తున్న శిఖా చౌదరిని ఎందుకు బహిర్గత పరచలేదు? అనేది కేసు విచారణలో ఏదో(వో) లుకలుకలు ఉన్న అనుమానాలకు తావిస్తుంది. ఈ ప్రధాన ప్రశ్నకు ఏపి పోలీసుల వద్దకు సమాధానం ఉందా? దట్స్ ఇట్! అందుకే పద్మశ్రీ తెలంగాణా పోలీసుల సహకారం కోరారు.   
  
ఈ కేసును ప్రస్తుతం ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో, న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తామని జూబ్లిహిల్స్‌ పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసును దర్యాప్తు చేయడంలో ఏపీ పోలీసులు విఫలమయ్యారని, నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, ఏదీ తేల్చలేకపోయారని, దీంతో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పద్మశ్రీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం రాత్రి హైదరాబాద్‌ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఎవరినైనా హైదరాబాద్ లో చంపేసి అమరావతిలో పారేస్తె చాలు-అంతా ఆంధ్రా పోలీసులు చూసుకుంటారని నేరస్తుల్లో ధీమా పెరుగుతోదని సెటైర్లు పేలుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: