టీడీపీ వలసలతో చంద్ర బాబు కు దడ మొదలైందా ...!

Prathap Kaluva

ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. అలాగే జగన్ సమరశంఖం అంటూ జిల్లా ల్లో భారీ సభలు పెడుతున్నాడు. దీనితో చంద్ర బాబు కు భయం మొదలైందని చెప్పాలి. జిల్లాకో చోట జగన్ సమర శంఖారావాలు పూరిస్తున్నారు. తొలివిడతగా తిరుపతిలో జరిగిన శంఖారావం సభ సూపర్ హిట్. అక్కడే చంద్రబాబు కాపీ పథకాలకు ప్రతిగా పింఛన్ ను 3వేలకు పెంచుతూ, ప్రతి చేనేత కుటుంబానికి 2వేలు ప్రకటిస్తూ.. సరికొత్త హామీలతో టీడీపీకి షాకిచ్చారు జగన్.


కడపలో రెండో శంఖారావం జరగబోతోంది. ఒక్క శంఖారావానికే చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. ఈరోజు తన సొంత ఇలాకా కడపలో జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారో అని చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ప్రజాసంకల్ప యాత్రకు వచ్చిన స్పందన.. సమర శంఖారావాలకు కొనసాగుతోంది. అంతేకాదు.. జిల్లాలో పెట్టే ఈ భారీ సభలలోనే చేరికలుంటాయని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో జరిగే సమర శంఖారావంలో వైసీపీలో చేరేందుకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి సిద్ధంగా ఉన్నారు.


ఆమంచి లాంటి అసంతృప్త ఎమ్మెల్యేలు.. టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నప్పటికీ మరికొంతమంది కీలక నేతలు సమరశంఖారావ సభలనే ముహూర్తాలుగా ఎంచుకున్నారు. దీంతో ఈ సభలంటేనే చంద్రబాబుకి దడ మొదలైంది. అనుకున్నట్టుగానే తిరుపతి సభ నుంచి టీడీపీకి ఎదురుదెబ్బ కొట్టారు జగన్. ఇక రాబోయే సభల్లో ఎలాంటి సంచలనాలుంటాయో, ఎంతమంది టీడీపీని వీడి వైసీపీలో చేరుతారో అని చంద్రబాబు భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: