సరికొత్త నినాదంతో ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్న జగన్..!

KSK
వైసీపీ పార్టీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే జగన్ పాదయాత్ర మొదలు పెట్టారో అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చాయి అని అనటం లో కూడా ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్ పాదయాత్ర మొదలు పెట్టక ముందు కూటమిగా ఉన్న బిజెపి జనసేన టిడిపి పార్టీలు జగన్ వేసిన ప్రతి అడుగుకి కూటమి కోటలు కూలిపోయి మూడుగా చీలి పోయాయి.


దీంతో తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ ని మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు ని టార్గెట్ చేసి జగన్ అద్భుతమైన రాజకీయాన్ని చేస్తూ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి చెమటలు పట్టేలా తలనొప్పిగా మారిపోయారు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కి టిడిపి ప్రభుత్వ ప్రతినిధులకు వారు చేస్తున్న అవినీతిని వారి వారి నియోజకవర్గాలలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో జగన్  అద్భుతంగా ప్రసంగించారు.


ఎవరైతే మోసపోయారో అనగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అర్థవంతంగా జగన్ ప్రసంగిస్తూ పాదయాత్రలో ముందుకు సాగారు. ముఖ్యంగా పాదయాత్ర చివరి రోజు భారీ బహిరంగ సభలో నిన్ను నమ్మం బాబు అంటూ జగన్ కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకువచ్చి టిడిపి కి తలనొప్పిగా మారారు. అయితే తాజాగా పాదయాత్ర ముగిశాక భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న జగన్ మరో సరికొత్త నినాదాన్ని అందుకున్నారు.


రాబోయే రోజుల్లో 'అన్న వస్తున్నాడు' అంటూ ప్రతి ఒక్కరు చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయిన వారికి తెలియ చేయాలని వైసిపి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సామాన్యులకు ధైర్యాన్ని ఇచ్చేలా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేయాలని 'అన్న వస్తున్నాడు' అన్న నినాదాన్ని ప్రజలకు నమ్మకం కలిగించేలా తెలియజెప్పాలని జగన్ తాజాగా ఇటీవల కడప లో జరిగిన భారీ బహిరంగ సభలో నినదించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: