అమరావతిలో భారీ స్కామ్.. ఒక్కో మొక్క రూ.7 లక్షలు..?

Chakravarthi Kalyan

అమరావతిలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు పెంచాలని అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. కేవలం 3750 మొక్కలను 5 కోట్ల రూపాయలతో కొనాలని నిర్ణయించడం షాక్ ఇస్తోంది.


సాధారణంగా మొక్కల ధర పదుల్లోనో.. వందల్లోనో ఉంటుంది. మరీ అంత ప్రత్యేకమైన మొక్క అయితే వేల్లో ఉండొచ్చు. కానీ అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ కొనబోతున్న మొక్కల విలువ ఏకంగా లక్షల్లో ఉండటం విశేషం. ఒక్కో మొక్క లక్ష రూపాయలు మొదలు కొని గరిష్టంగా 7లక్షల వరకూ వెచ్చిస్తున్నారట.



ఆలివ్ మల్టీ బ్రాంచెస్ - రూ. 1.60 లక్షలు, పెద్ద ఆవివ్ మొక్కలు- రూ. 7.80 లక్షలు.. ఇలా ఉన్నాయి మొక్కల రేట్లు. మొత్తం మీద సగటున ఒక్కో మొక్క 12 వేల రూపాయలకు పైగానే పలుకుతోంది. ఇలా చేయడం ఇదే మొదటిసారి కూడా కాదు. గతంలోనూ ఇలాగే మొక్కల పేరుతో దుబారా జరిగింది.


ఒక పక్క అమరావతి నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు. కేవలం టెంపరరీ సచివాలయం మాత్రమే పూర్తయింది. ఇంకా పర్మినెంట్ బిల్డింగులే రాలేదు. ఇలాంటి సమయంలో మొక్కల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: