మత్తయ్య ఓటుకు నోటు దీక్ష - వర్సెస్ - చంద్రన్న డిల్లీ ధర్మ పోరాట దీక్ష -

కేంద్రానికి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 11 న దిల్లీలో దీక్ష చేస్తుండగా, అదే రోజున చంద్రబాబును ఇరుకున పెట్టేలా మరో దీక్ష మొదలవుతోంది. ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు లాంటి వారిని విడిచిపెట్టి, నిర్దోషినైన తనను నిందిస్తున్నారని ఆరోపిస్తూ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెరూసలెం మత్తయ్య అదే రోజు దిల్లీలో నిరసన దీక్ష చేపడుతున్నారు. మత్తయ్య దీక్షకు పలు క్రైస్తవ సంఘాలు మద్దతిస్తున్నాయి కూడా. 


దళిత క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, తమ వర్గాన్ని అవమానిస్తున్నారని ఓటుకు నోటు కేసు లో ఆరోపణలు ఎదుర్కొన్న జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తమ ఓట్లను తొలగిస్తుంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. తనను ఓటుకు కేసులో బలవంతంగా ఇరికించారని, కానీ తనను నిర్దోషిగా హైకోర్టు ప్రకటిందని గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం దక్కలేదన్నారు. 

    
కాగా ఎన్నికలకు ముందే ఓటుకు నోటు కేసు లో నిందితులను శిక్షించాలని జెరూసలెం మత్తయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేస్తే,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తన పేరు మార్చడాన్ని ఖండించారు. ఈ కేసులో తనను నిర్దోషిగా హైకోర్టు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 11 న ఢిల్లీలో నిరసన చేపడుతున్నట్టు వెల్లడించారు.


జెరూసలెం మత్తయ్య శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు, ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ సెబాస్టియన్, రేవంత్ రెడ్డిలతో, ఏపీ సీఎం చంద్రబాబు కోర్టులను ఆశ్రయించి తనలాగ నిర్దోషిత్వం నిరూపించుకోవాలని సూచించారు. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు లాంటి వ్యక్తులను ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఉదయసింహా, రేవంత్ రెడ్డి ఎవరూ తనకు శత్రువులు కాదని, ఓటుకు నోటు లాంటి వ్యవస్థలను దుస్థితిలోకి నెట్టెసిన పరిస్థితులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

 
చంద్రబాబు మందీమార్బలంతో దిల్లీలో దీక్ష చేస్తున్న రోజునే ఆయనపై ఆరోపణలున్న ఓటుకు నోటు కేసు విషయంలోనూ దీక్ష జరుగుతుండడంతో టీడీపీ ఇరుకునపడుతోంది. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ దీక్షలు చేస్తున్న టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా జెరూసలెం మత్తయ్యతో దీక్ష చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: