బాబు లెక్క పక్కానా...!!

Satya
చంద్రబాబు రాజకీయాల్లో గండర గండడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యూహాలు ఎత్తులు వూహకైనా అందవు. పాదరసం కంటే వేగంగా ఆలొచనలు చేయడంలో బాబుకు బాబే సాటి. పూర్తి   వ్యతిరేకంగా ఉన్న వాతావరణాన్ని సానుకూలం చేసుకోవడం ఎలాగో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు, అందుకే ఆయన సవాళ్ళకు తనదైన   శైలిలో సమాధానాలు చెబుతారు. అలాగే విజయాలూ అందుకుంటారు.


ఎవరినీ వదలలేదుగా :


సరిగ్గా కొన్ని నెలల క్రితం చూస్తే ఏపీలో బాబుకు విపరీతమైన వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తమకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని, తమకు పాలకులు పట్టించుకోవడంలేదని కూడా విమర్శలు వెల్లువలా బాబు సర్కార్ మీద వచ్చాయి. అయితే ఈ పరిస్థితిని మార్చడంలో బాబు మాస్టర్ ప్లాన్  వేశారు. ఇక కొత్త ఏడాది రావడంతో వరాల మూట విప్పేశారు. డ్వాక్రా మహిళలకు పది వేల పించన్లు, వ్రుద్ధులకు రెట్టింపు పించను, బీసీలకు కులానికో కార్పోరెషన్, కాపులకు ఈబీసీ లో అయిదు శాతం రిజర్వేషన్ వాటా. ఉద్యోగులకు 20 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇలా బాబు చాలా  చేశాననిపించుకున్నారు. అలాగె రైతులకు ఎకరాకు పది వేల రూపాయల రైతు భరోసా, నిరుద్యోగులకు రెండు వేల భ్రుతి వంటివి బాబు  ఇప్పటికి ఇపుడు తీసుకున్న నిర్ణయాలే.


వారు పాజిటివ్ అయితే :


ఇక్కడే  బాబు లెక్కలు పక్కాగా ఉన్నాయి. డ్వాక్రా మహిళలు ఏపీలో 94 లక్షల మంది ఉన్నారు. అలాగే, రైతులు 54 లక్షలు ఉన్నారు. నిరుద్యోగ యువత నాలుగున్నర లక్షలు ఉన్నారు. బీసీలు జనాభాలో యాభై శాతం ఉన్నారు. కాపులు పాతిక శాతం ఉన్నారు. దళిత  క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓట్లకూ గాలం వేశారు.
బ్రాహ్మణ కార్పోరేషన్ కి వంద కోట్లను కేటాయించడం ద్వారా ఆ వర్గం మద్దతు, క్షత్రియులకు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ యాభై కోట్లు కేటాయించడం ద్వారా వారి మన్నల కోసం బాబు తపన పడ్డారు. ఇవన్నీ కూడితే ఏపీలో ఉన్న మొత్తం మూడు కోట్ల మంది ఓటర్ల లెక్క సరిపోతుంది. అయితే ఇందులో అంతమంది కూడా తనకే ఓటేస్తారని బాబు కూడా  అనుకోవడం లేదు. సగానికి సగం మంది తనను  నమ్మి ఓట్లు వేసినా చాలు తనకు తిరిగి సీఎం పీఠం దక్కుతుందని పక్కాగా ప్లాన్ వేసుకునే ముందుకు సాగుతున్నారు. మరి బాబు ఎంతైనా రాజకీయ చాణక్యుడు కదా .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: