గృహప్రవేశానికి రెడీ అయిపోయిన వైఎస్ జగన్..!

KSK
వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటే ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను గత కొంత కాలం నుండి హైదరాబాద్ నగరంలో లోటస్పాండు నివాసం నుండి పర్యవేక్షించిన జగన్ తాజాగా ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఫిబ్రవరి 14వ తారీఖున అడుగుపెట్టబోతున్నారు.


జగన్ సొంతంగా మంగళగిరి వద్ద ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేయబోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే, జగన్ మాత్రం ఎపి రాజధానిలో నిర్మించుకున్నారు.ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో జగన్ నూతన గృహ ప్రవేశం చేస్తారు. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.


మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓ లేఖ రాశారు.


దీంతో వైయస్ జగన్ రాష్ట్రంలో అందుబాటులో ఉండటంతో వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎంతగానో సంతోషిస్తున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధాని పోతుందని కొంతమంది ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్లకు తాజాగా వైఎస్ జగన్ అమరావతి ప్రాంతంలోనే తన స్థిర నివాసం ఏర్పరచుకోవడం తో చెక్ పెట్టినట్లయింది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: