ఎడిటోరియల్ : మోడిని చంద్రబాబుఅందుకే అడ్డుకునేందుకు ప్రయత్నించారా ?

Vijaya

చంద్రబాబునాయుడు వ్యూహంలో అదే కనిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని సైతం ఎదరికించిన ధీరుడు చంద్రబాబు అనే ప్రచారం కోసమే తాపత్రయపడుతున్నట్లు కనబబడుతోంది. లేకపోతే ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా తిరిగే స్వేచ్చున్నపుడు సాక్ష్యాత్తు నరేంద్రమోడి రాష్ట్రానికి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేయటంలో అర్ధమేంటి ? మోడి రాకను అడ్డుకోవటమంటే కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడటమే. మోడి రాష్ట్రానికి వచ్చింది గుంటూరు బహిరంగసభలో పాల్గొన్నారు. ఎటూ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న సమయంలో వచ్చారు కాబట్టి కచ్చితంగా రాజకీయమే మాట్లాడారనటంలో సందేహం లేదు.

 

ఎన్నికల్లో లబ్ది పొందటమే మోడి లక్ష్యం కాబట్టి ప్రధాన ప్రత్యర్ధి చంద్రబాబు మీదే బాణాలు ఎక్కుపెట్టారు. నిజానికి నాలుగేళ్ళపాటు కేంద్రంలో ఎన్డీఏతో అంటకాగినంత కాలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను సైతం ఫణంగా పెట్టిన ఘనుడు చంద్రబాబు. తాను అనుకున్న వ్యక్తిగత ప్రయోజనాలు అందవని తీర్మానించుకున్న తర్వాతే ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేశారు. చంద్రబాబు ప్రయోజనాలు ప్రధానంగా రెండేనట. మొదటిది అసెంబ్లీ సీట్ల సంఖ్యను 175 నుండి 225కి పెంచటం. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపటం.

 

పై రెండు డిమాండ్లపైన మోడి సానుకూలంగా స్పందిచకపోవటంతోనే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి మోడితో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఘర్షణ మోడ్ లోకి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే చంద్రబాబుకి ఎవరితోను నేరుగా ఘర్షణ పెట్టుకునేంత సీన్ లేదు. తాజాగా మోడి రాకను నిరసిస్తు ఘర్షణ పెట్టుకుంటున్నారంటే రాబోయే ఎన్నికల్లో ఓట్ల  కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా ఘర్ఫణకు వెనకాడనని జనాల ముందు బిల్డడ్ ఇవ్వటం కోసమే ఇదంతా.

 

 గుంటూరుకు వచ్చారు కాబట్టి మోడిని అడ్డుకుందామని అనుకున్నారు సరే. మరి సోమవారం చంద్రబాబు దీక్షను ఢిల్లీలో చేస్తున్నారు కదా ? మరి ఇప్పుడేమవుతుంది ? చంద్రబాబు దీక్షను ఢిల్లీలో మోడి భగ్నం చేయరా ? ఢిల్లీ దీక్ష నరేంద్రమోడి సర్కారుకు వ్యతిరేకంగానే కదా చేస్తున్నది ? అంటే చంద్రబాబుకు అదే కావాల్సింది. ఏపిలో అయినా ఢిల్లీలో అయినా చంద్రబాబుకు కావాల్సింది కేవలం ప్రచారం మాత్రమే.

 

రాష్ట్రస్ధాయిలో ప్రధానిని టిడిపి అడ్డుకోవటాన్ని జాతి మీడియా ఎటూ బ్రహ్మాండంగా కవర్ చేస్తుంది. అదే ఢిల్లీలో మోడికి వ్యతిరేకంగా చేసే దీక్షను కూడా జాతి మీడియానే భుజానికెత్తుకుంటుంది. అదే దీక్షను భగ్నం చేస్తే జాతీయ మీడియా కూడా కవరేజ్ ఇస్తుంది. చంద్రబాబుకు కావాల్సింది అదే, ఏమంటారు ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: