బాబు ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు ... అయినా ఎన్నికల్లో గెలుస్తాడా ...!

Prathap Kaluva

చంద్ర బాబు ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే కాబోలు ఎన్నికల రెండు నెలల ముందు వరాల జల్లు కురిపిస్తున్నాడు.  ఇప్పటిదాకా వెలువడిన సర్వేలన్నీ కూడా జగన్ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీ అనుకూల సర్వేలను మినహాయిస్తే... మిగిలిన అన్ని సర్వేల మాట కూడా ఇదే. ఈ సర్వేలపై తనదైన కామెంట్లు చేస్తున్నాడు  చంద్రబాబు . 


ఆ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్కు అధికారం అందకుండా ఉండటంతో పాటు తానే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఏమేం చేయాలన్న విషయాలపై బాబు బాగానే కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన కొత్త పథకాలకు తెర తీశారు. ఈ పథకాలు జగన్ నోట నుంచి వెలువడినవే అయినప్పటికీ... బాబు ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. ఇప్పటికే పింఛన్ల సొమ్మును రెట్టింపు చేసిన చంద్రబాబు... ఆటోలు ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ను రద్దు చేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరిట రూ.10వేలు విడుదల చేస్తున్నారు.


తమపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాలకు తెర తీశారని చెప్పాలి.  అయితే బాబు మార్కు రాజకీయాలను చాలా కాలం నుంచి చూస్తున్న ప్రజలు... ఈ దఫా బాబు జిమ్మిక్కులకు పడిపోతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎన్ని అనుమానాలు ఉన్నా.. బాబు మాత్రం తనదైన శైలి వ్యూహాలను అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ వ్యూహాలు చంద్రబాబుకు ఏ మేర కలిసి వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: