చంద్రబాబు దీక్షలో.. రచ్చ రచ్చ చేసిన దివ్యవాణి..?

Chakravarthi Kalyan
టీడీపీలో ఇటీవల చేరిన నటి దివ్యవాణి.. తన నటనావైదుష్యాన్నంతా ఆ పార్టీ సభల్లో చూపించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఈ నటనామణి అవకాశం వచ్చిన ప్రతిసారీ దాన్ని ఉపయోగించుకుంటూ టీడీపీ బాస్ చంద్రబాబు దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఢిల్లీ దీక్షలో తన టాలెంట్ చూపించేసింది.



చంద్రబాబు దీక్షకు ఒక్కొక్కరుగా విపక్షాల నేతలు వచ్చి మద్దతు ప్రకటిస్తున్న సమయంలో దివ్యవాణి మైక్ అందుకుంది. ఆ సమయంలోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చంద్రబాబుతో పాటు వేదికపై కూర్చొన్నారు. ఇక ప్రసంగం మొదలుపెట్టిన దివ్యవాణి ముందుగా అందరికీ వందనాలు తెలియజేసింది.



అంతే.. ఆ వెంటనే డైరెక్టుగా మోడీపై తిట్ల దండకం అందుకుంది. చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ.. మోడీని ఎండగడుతూ ప్రసంగం వేడెక్కించింది. అరుపులు, కేకలు పెడబొబ్బలతో సినిమాలను మించిన ఆవేశం చూపించింది. ఆమె ప్రసంగంతో అంతా ఒక్కసారిగా ఎలర్టయ్యారు.



పూనకం వచ్చినట్టు.. గొంతెత్తి నినాదాలు చేస్తూ.. మన చంద్రన్న.. మన చంద్రన్న అంటూ చంద్రజపం సాగించింది. నరేంద్ర మోడీని గొడ్డుబోతోడివి నీకేం తెలుసు కుటుంబం అనుబంధం అంటూ తిట్టిపోసింది. ఒక దశలో దివ్యవాణి జోరు చూసి చంద్రబాబు కూడా అవాక్కయ్యారు. మరి ఇంకేం.. వచ్చే ఎన్నికల్లో దివ్యవాణికి ఓ సీటు ఖాయం అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: