పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!

Edari Rama Krishna
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నింధితుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ సందర్బంగా కొన్ని భయంకర సత్యాలు వెలుగు లోకి వస్తున్నాయి.  రాకేష్‌రెడ్డిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమించడంతో... మూడు రోజుల కస్టడీలో భాగంగా విచారణ చెపట్టారు. జయరాం హత్యకు దారితీసిన విషయాలపై రాకేష్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే, తనకు జయరాంను చంపాలన్న ఉద్దేశం లేదని పోలీసుల విచారణలో స్పష్టం చేశారు రాకేష్‌రెడ్డి. ఇది ప్రి ప్లాన్డ్ మర్డర్ కాదు.. తాను కొట్టిన దెబ్బలకు అనారోగ్యంతో ఉన్న జయరాం చనిపోయాడని చెప్పుకొచ్చాడు. జనవరి 31న జయరాం బాడీ కారులో పెట్టుకొని తిరిగానని..హత్య జరిగిన రోజు సీఐ శ్రీనివాస్ కు 13 సార్లు ఫోన్ చేశానని.. హత్య జరిగిన తర్వాత ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు వెల్లడించారు. వారి సూచనలతోనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నానని పోలీసులకు తెలిపాడు రాకేష్‌రెడ్డి.

కాగా, రాకేష్ రెడ్డికి  నలుగురు ఏసీపీలు, నలుగురు ఇన్ స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలతో రాకేష్ కు మంచి పరిచయాలు. ఇప్పటికే నల్లకుంట ఇన్స్ స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీలపై బదిలీ వేటు. 

మరో తొమ్మిది మంది పోలీసు అధికారులపై వేలాడుతున్న కత్తి.  హత్య జరిగిన తర్వాత 11 మందికి కాల్ చేసిన రాకేష్ రెడ్డి.  పదకొండు మంది అధికారుల పాత్రపై విచారణ జరుపుతున్న పోలీసులు. బదిలీ అయిన ఇద్దరు అధికారులను ఇవాళ విచారించనున్న పోలీసులు. త్వరలో అన్ని విషయంలు తెలుసుకొని కేసు కొలిక్కి తెస్తామని పోలీస్ అధికారుల అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: