టీడీపీ నేతల మాటల్లో స్పష్టంగా ఓటమి భయం..?

Chakravarthi Kalyan

వైసీపీలోకి వరుస వలసలు టీడీపీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.. మొన్న రావెలకిషోర్ బాబు.. ఆ తర్వాత మేడా మల్లిఖార్జునరెడ్డి.. ఆ వెంటనే ఆమంచి కృష్ణమోహన్.. ఆ తర్వాత ఎపీ అవంతి శ్రీనివాసరావు.. ఇక్కడితో ఈ జాబితా ఆగుతుందా.. అనుకునే లోపే మరో నేత దాసరి జై రమేశ్ కూడా వైసీపీలో చేరిపోయారు.



వరుస వలసతో దిక్కుతోచని టీడీపీ నేతలు మీడియా ముందు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. అందుకే ఆ వారికి ఇక్కడ సీట్లు రావు అందుకే వెళ్తున్నారని బుకాయిస్తున్నారు. వారి మాటల్లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.



నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప కూడా పైపైకి గంభీరంగానే మాట్లాడుతున్నా లోపల భయం అలాగే ఉంది. ఇలాంటి నేతలు పార్టీ వదిలి వెళ్లిపోతేనే మంచిదంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. గంటా అయితే వెళితే వెళ్లండి కానీ తిట్టకుండా వెళ్లండంటూ సుద్దులు చెబుతున్నారు.



విశాఖపట్నం జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం ఆత్మరక్షణ ప్రకటనలు ఇవ్వవలసి వస్తోంది. తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని ఎలమంచిలి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు చెప్పారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని మరో ఎమ్మెల్యే వి.అనిత అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: