"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, రాజకీయ వారసుడు ఆ రాష్ట్ర ఐటి శాఖామాత్యులు నారా లోకేష్ నాయుడు తన ప్రతిభ ఇంకా చూపుతూనే ఉన్నారు. అన్నీ ప్రతికూల సందర్భాల్లోనే వివాదంలో తలపెట్టేస్తాడు. అసలే సోషల్ మీడియా ఫావరేట్ అయిన లోకేష్ గురించి ఏ రేంజిలో ట్రోలింగ్ అవుతూ ఉంటాయో జగానికి జనానికి తెలియంది కాదు. అతనో ట్వీట్ వేశాడంటే వందల మంది ఆ ట్వీట్ లో రంద్రాన్వేషణ చేసి అతడిని ట్రోల్ చేయడానికి సర్వకాల సర్వావస్థలందూ సిద్ధంగానే ఉంటారు. ట్వీట్లు పెట్టే ముందు కొంచం ఆలోచించి కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఆయనకు చాలా ఉంది.  తానో విఙ్జాన ఖని అని అన్ని విషయాల మీదా తెలిసి తెలియక స్పందించేస్తే మొత్తం అంతర్జాలం హాస్యోక్తులతో అల్లకల్లోలమై ప్రతికూలమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అలాంటిదే ఒక ట్రోలింగ్ అవుతుంది.  

స్టాన్-ఫొర్డ్ ఇంటెల్లిజెన్స్ 

‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ ప్రచార చిత్రం (ట్రైలర్) విడుదలైన విషయం తెలిసిందే. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ధారుణ డిజాస్టర్ అయిన నేపథ్యంలో రెండో భాగం మీద కూడా దాని ప్రభావం పడి - చాలా విస్తృత వ్యతిరేఖత నెలకొంది. ఆ వ్యతిరేఖతను ఏ కొంతైనా విడుదలైన ట్రైలర్ తగ్గించగలదేమో అని ఆశించే తరుణంలో అలాంటిదేమీ జరగకపోగా ఆ ట్రైలర్ అతి పేలవంగా ఉండి ఎగ్జైట్మెంట్ కు కావలసిన అంశాలే లేనట్లు కనిపించింది. అయితే అదేవిషయంలో ట్రైలర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తున్న సమయంలో లోకేష్ వేలే కాదు, ఏకంగా కాలెట్టేశాడు అంతే తెగ పొగిడేశాడు. వీళ్ళ కుటుంబానికి వాళ్ళే దేవతలని అని పించుకోవాలనే దురదెక్కువ. సాధారణ మనుషులుగా బ్రతకటమే రాదు ఈ నందమూరి జనానికి. 

"వెండి తెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్యనాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి బయోపిక్ లో రెండవ భాగం ‘మహానాయకుడు’ చిత్ర ట్రైలర్ అత్యద్భుతం గా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానాయకుడిగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి" అని ట్వీట్ చేశాడు లోకేష్. ఈ ట్వీట్ మీద జనాలు ఎలా స్పందించి ఉంటారో ఊహించటం చేతకానివాళ్లు కాదు ఉభయ రాష్ట్రాల తెలుగుజనం. ఇక చెప్పేదేముంది? ‘యన్.టి.ఆర్’ సినిమాలో భజన మరీ ఎక్కువైపోవడమే ఈ సినిమా పరాజయానికి కారణమన్నది నగ్నసత్యం.         

ఎన్టీఆర్ జీవితం ఒక తరం తెలుగువాళ్లకి కరతలామలకం. అసలు నిజాలు దాచేసి, అతిశయోక్తులతో వంశం, రక్తం, బ్రీడ్ సీడ్ అంటూ స్వంత డబ్బ కొట్టేసుకొంటే డబ్బుపెట్టి టిక్కెట్ కొన్నోళ్ళకి చీము నెత్తురు ఉంటుంది కదా! వారి స్వకుచమర్ధనాలతో నింపేశారన్నది ఈ సినిమాపై ఉన్న ప్రధానవిమర్శ. 

ఇక నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించడం మీదా చాలా విమర్శలు వచ్చాయి. ‘ఎన్ టీఆర్ మహానాయకుడు’ కూడా అందుకు భిన్నంగా లేదు. అందరూ ఈ ట్రైలర్‌ను తిట్టిపోస్తున్న తరుణంలోో లోకేష్ వచ్చి, "ట్రైలర్ అత్యద్భుతమని, బాలా మామ నటన మహోన్నతం మహాద్భుతమో అని అంటే జనాలకు పుండు మీద కారం జల్లినట్లుంది - ఇక సీన్ సితార చేయక ఏం చేస్తారు. 


నెటిజన్లకు మంటెత్తి ట్రోలింగ్ కు బాగా అలవాటుపడిన లోకేష్‌ను గట్టిగా తగులుకున్నారు. ఎన్టీఆర్ గురించి పొగడ్డంచూసి "అంత గొప్ప వ్యక్తిని, మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచాడు" అంటూ కొందరు ప్రశ్నిస్తే ఇంకొందరు ‘యన్.టి.ఆర్’ సినిమాను తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి లోకేష్ ఈ ట్వీట్ వేసి అనవసరంగా విమర్శలకు స్వాగతం  పలికేశారు. అసలు బాలకృష్ణ వెకిలి వేషాలకు అసందర్భ సంభాషణలకు విసుగెత్తి ఉన్న నెటిజెన్స్ లోకేష్ దొరగ్గానే  ఫుట్-బాల్ ఆడేసుకున్నారు
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: