10 మంది అభ్యర్ధులు ఫైనల్..గుడివాడలో అభ్యర్ధే దొరకటం లేదట

Vijaya

రాజధాని జిల్లాల్లో ఒకటైన కృష్ణా జిల్లాలో 10 మంది అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ఫైలన్ చేసినట్లు సమాచారం. అభ్యర్ధుల వడపోత తర్వాత నేతలతో జరిగిన సమావేశంలో పదిమందిని ఎన్నికల బరిలోకి దిగాల్సిందిగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే మొత్తం 16 నియోజకవర్గాలకు గాను ఇక పెండింగ్ లో ఉన్నది ఆరు నియోజకవర్గాలే. ఫైనల్ చేసిన నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజవకర్గంలో ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్  ఉండటం గమనార్హం.

 

చంద్రబాబు ఖరారు చేసిన అభ్యర్ధుల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుండి దిగుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుండే మరో మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు.  అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్, విజయవాడ తూర్పులో గద్దె రమ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమ, జగ్గయ్యపేటలో శ్రీ రామ్ తాతయ్య, నందిగామలో తంగిరాల సౌమ్య, గన్నవరంలో వల్లభనేని వంశీ, పెనమలూరులో బోడె ప్రసాద్ ఉన్నారు.

 

పెడన, పామర్రు, గుడివాడ, తిరువూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిల్లో గుడివాడ చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ వైసిపి ఎంఎల్ఏ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నానితో తలపడే స్ధాయి నేతలు టిడిపిలో లేరనే చెప్పాలి. బహుశా దేవినేని అవినాష్ పోటీ చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నానిని ఓడించటం చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారిందనే చెప్పాలి.

 

ఇక ఫైనల్  అయిన పదిమందిలో చాలామంది ప్రజా వ్యతరేకతను ఎదుర్కొంటున్నవారే. మంత్రులు దేవినేని ఉమా, కొల్లుతో పాటు ఎంఎల్ఏలు తంగిరాల సౌమ్య, బోండా, గద్దె, జలీల్ ఖాన్ ప్రభావం షబానా ఖాతూన్ పై పడటం ఖాయమనే తెలుస్తోంది.  అదే సమయంలో పై నియోజకవర్గాల్లో వైసిపి తరపున గట్టి అభ్యర్ధులే ఉన్నారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో పేర్ని నాని, పెనమలూరులో కాల్ మనీ సెక్స్ రాకెట్ సూత్రదారి బోడె ప్రసాద్ పై జనాలు మండిపోతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అంత ఈజీ కాదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: