పాకిస్తాన్ పై భారత్ జలయుద్ధం

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కమాండర్‌ అదిల్ అహ్మద్ దార్‌ సీఆర్‌పీఎఫ్‌ బలగాల వాహనశ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈఘటనలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడి కీలక సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టింది. ఆపై కశ్మీర్‌లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరిక లు జారీ చేసిన సంగతి తెలిసిందే.



పాకిస్థాన్ దుశ్చర్యలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న భారతప్రభుత్వం ఇప్పటికే  పాకిస్తాన్‌ కు "ఎంఎఫ్‌ఎన్ హోదా"  ను ఉపసంహరించు కోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులకు కస్టమ్స్ డ్యూటీని 200 శాతం పెంచిన సంగతి తెలిసిందే.



తాజాగా సింధు జలాల్లో తన వాటాను పాకిస్థాన్‌కు వాడుకోకుండా అడ్డుకోవాలని భారత్ నిర్ణయించింది. పాకిస్థాన్ దుశ్చర్యలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న భారతావనికి భారత ప్రభుత్వం గురువారం ఒక గట్టి నిర్ణయాన్ని తెలియజేసింది. భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న నదుల నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్న భారతీయ జలాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుస ట్వీట్లలో ఈ వివరాలను వెల్లడించారు. పుల్వామా దాడి ఘటనతో పాకిస్థాన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్, ఆ దేశాన్ని అన్నివిధాలా దెబ్బతీసే ప్రయత్నాల్లో ఉంది. యుద్ధ క్షేత్రంలోకి దిగకుండా దాయాదికి తనేంటో చూపిస్తోంది.



Nitin Gadkari
✔@nitin_gadkari
Under the leadership of Hon'ble PM Sri @narendramodi ji, Our Govt. has decided to stop our share of water which used to flow to Pakistan. We will divert water from Eastern rivers and supply it to our people in Jammu and Kashmir and Punjab.

32.1K
6:26 PM - Feb 21, 2019

"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మన ప్రభుత్వం పాకిస్థాన్‌ కు వెళ్ళే మన వాటా జలాలను నిలిపేయాలని నిర్ణయించింది. తూర్పు నదుల నుంచి జలాలను మళ్ళించి, జమ్మూ-కశ్మీరు, పంజాబ్‌లలోని మన ప్రజలకు సరఫరా చేస్తాం" అని oka ట్వీట్‌లో గడ్కరీ తెలిపారు.
"రావి నదిపై షాపూర్-కంది వద్ద ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అంతేకాకుండా, యూజేహెచ్ ప్రాజెక్టు జమ్మూ-కశ్మీరు వాడకం కోసం మన వాటా నీటిని నిల్వ చేస్తుంది. మిగిలిన జలాలను రెండో రావి-బియాస్ అనుసంధానం నుంచి ఇతర పరీవాహక రాష్ట్రాలకు అందజేస్తాం" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
"ఈ ప్రాజెక్టులన్నిటినీ జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాం" అని మూడో ట్వీట్‌లో తెలిపారు.
భారత దేశానికి హక్కుగా లభించే జలాలు ఇప్పటివరకు పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్నాయని, ఆ అదనపు జలాల వాడకం హక్కును వినియోగించుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
సట్లెజ్, బియాస్, రావి నదులను తూర్పు నదులు అంటారు. ఈ నదీ జలాలు పాకిస్థాన్‌ కు చేరకుండా అడ్డుకోవడం వల్ల, ఉగ్రవాదానికి గట్టి మద్దతిస్తున్న దేశాన్ని దీటుగా శిక్షించడంలో కీలక చర్యగా భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: