అఖిలేష్ పై సీరియస్ అయిన ములాయం..!

KSK
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎలాగైనా గద్దె దించాలని దేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నాయి.


ఈ క్రమంలో మరో పక్క బహుజన సమాజ పార్టీతో సమాజవాది పార్టీ పొత్తును ఆ పార్టీ వ్యవస్థాపకుడు మూలాయం వ్యతిరేకించడం విశేషం. తన కుమారుడు ,ప్రస్తుతం ఎస్పి అద్యక్షుడు అయిన అఖిలేష్ యాదవ్ తీరును ఆయన తప్పు పట్టారు.


ఈ పొత్తు వల్ల సమాజవాది పార్టీ తీవ్రంగా నస్టపోతోందని ఆయన హెచ్చరించారు. పార్టీని కాపాడాల్సిన వారే బద్ధ శత్రువైన బహుజన్‌ సమాజ్‌వాది పార్టీతో చేతులు కలిపి భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పటిష్టమైన ఎస్పీని సొంత మనుషులే నాశనం చేస్తున్నారని వాపోయారు.


యూపీలో ఉన్న 80 ఎంపీ స్ధానాలకు గాను ఎస్పీ 37, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేస్తాయని మయావతి, అఖిలేష్‌ లు ప్రకటించిన తర్వాత మూలాయం ప్రకటన కలకలం రేపింది. దీంతో తాజాగా ఈ ఘటన జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: