జనసేన పార్టీ తోనే మార్పు సాధ్యం అంటున్న పవన్ కళ్యాణ్…!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత రాజకీయాల్లో మార్పు కోరుకుంటుందని పేర్కొన్నారు. యువకులు ఏ విధమైన మార్పు కోరుకుంటున్నారో అది జనసేన పార్టీ తోనే సాధ్యమని  పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ముఖ్యంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ఇంత మంది ప్రజలు స్వాగతం చెబుతున్నారంటే,గుండెలు కొట్టుకుంటున్నారనంటే రౌడీయిజం,ప్యాక్షనిజం వంటి వాటితో ప్రజలు అలసిపోవడమ కారణమని అన్నారు. ఎంత సేపు కుటుంబ కబంద హస్తాలలో రాకీయం నలిగిపోవాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.


జనసేన వద్దకు వస్తున్నారంటే ప్రజలు స్వేచ్చ కోరుతున్నారని,మార్పు అడుగుతున్నారని, ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.కర్నూలు అంటే ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గుర్తుకు వస్తాడని అన్నారు.రెడ్డి అంటే ప్రజలను కాపాడేవాడని అర్దం అని ఆయన అన్నారు.


రెడ్డి కులం కాదని అన్నారు. ఒక ఎమ్పి ఒక మాట చెప్పారని, కులాల ప్రస్తావన వస్తోందని,కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఒకప్పుడు సుందరయ్య కులం తెలియదని అన్నారు.మనకు సంబందించినవాడు వస్తేనే న్యాయం జరుగుతుందనుకుంటే ముఖ్యమంత్రి కావాలని ఆయా కులాలు కోరుకుంటాయని, కులాలను కలిపి రాజకీయం చేయాలని,అదే జనసేన లక్ష్యం అని పవన్ కళ్యాణ్్ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: