పుల్వామా సంఘటనకు జైషే తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్న భారత వైమానిక దళం


కాశ్మీర్ పుల్వామాలో 42మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో భారత సైన్యం రగిలిపోతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది. తెల్లవారు జామున 3గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై సుమ్రు 1000 కిలోల ప్రేలుడు పదార్ధాలతో బాంబుల వర్షం కురిపించింది. ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ జైషె మహమ్మద్ శిబిరాలేనని తెలుస్తుంది. 

సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకరంగా దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్, చకోటీ, ముజాఫరాబాద్ లోని 3 అతి పెద్ద జైషే మహమ్మద్ నియంత్రణ శిబిరాలు ద్వంసం అయినట్లు సమాచారం. ఈ సర్జికల్ స్ట్రైక్ -2, ద్వారా 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యం లో భారత్‌-పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


12 భారత మిరేజ్-2000 విమానాలు బాంబులను జారవిడిచాయి. ఈ దాడిలో పీఓకేలోని అతిపెద్ద జైషే ఉగ్రవాద శిబిరం నామరూపాల్లేకుండా పోయింది సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతోనే భారత వైమానిక దళం ఈ పని విశ్వం నిద్దురపోతున్న వేళ నిశ్శబ్ధంగా తన పని చేసుకొని వెనుదిరిగి వచ్చాయనేది సమాచారం.  21 నిమిషాల్లో ఈ ఆపరేషన్ ముగిసిందని తెలుస్తుంది. ఈ ప్రతీకార దాడుల గురించి అజిత్ దోవల్ ప్రధానికి వివరించారని తెలుస్తుంది.

12 భారత యుద్ధ విమానాలు పీఓకేలోకి ప్రవేశించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే అయితే పాక్ మాత్రం తన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ  భారత విమానాల ను తమ ఫైటర్ జెట్స్ తరిమికొట్టినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: