ఎడిటోరియల్ : జగన్ పై బిసిలకు నమ్మకం కలుగుతుందా ?

Vijaya

ఇచ్చిన మాట మీద జగన్మోహన్ రెడ్డి నిలబడతారని వైసిపి వర్గాలు అంటుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ విషయం రుజువైంది కూడా.  వైసిపి బిసి సెల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విషయంలో మరోసారి రుజువైంది. జంగాకు ఎంఎల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. తాజాగా భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాల్లో వైసిపికి దక్కిన ఒక్క ఎంఎల్సీ స్ధానాన్ని జంగాకే జగన్ కేటాయించారు. దాంతో జంగా ఎంఎల్సీ అయిపోయారు.

 

ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం చాలా కీలకమనే చెప్పాలి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అందుకనే ఇటు చంద్రబాబునాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ పోటీపడి వివిధ వర్గాలకు హామీలనిస్తున్నారు. జనాభాలో మెజారిటీ సామాజికవర్గాలు కాబట్టి సహజంగానే ఇద్దరూ బిసి, కాపుల ఓట్లపై కన్నేశారు.

 

అందుకనే వారిని ఆకట్టుకునేందుకు పోటాపోటీగా హామీలిస్తు, సభలు నిర్వహిస్తున్నారు. టిడిపి రాజమండ్రిలో  నిర్వహించిన జయహో బిసి, వైసిపి ఏలూరులో నిర్వహించిన బిసి గర్జన ఇందులో భాగమే. సరే చంద్రబాబు గతంలో బిసిలు, కాపులకిచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదు.  కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీని అమలు చేయటంలో చంద్రబాబు ఫెయిలయ్యారు. దాంతో కాపులొకవైపు కాపులను బిసిల్లో చేర్చటం ఇష్టంలేని బిసిలు మరోవైపు చంద్రబాబుపై మండిపోతున్నారు.

 

ఈ సమయంలో ఐదు ఎంఎల్సీ పదవుల భర్తీకి అవకాశం వచ్చింది. దాంతో ఏలూరు సభలో జగన్ మాట్లాడుతూ వైసిపికి వచ్చే ఒక్క స్ధానాన్ని బిసిలకే కేటాయిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అన్నట్లుగానే జంగా కృష్ణమూర్తికి కేటాయించి హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన రాజకీయ పరిణామం రాబోయే ఎన్నికల్లో వైసిపికి సానుకూల వాతావరణం ఏర్పడకే అవకాశం ఉందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

 

ఎంఎల్సీ సీటు కేటాయింపులో బిసిలకు ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది. ఎన్నికల్లో బిసిల ఓట్లు కొల్లగొట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఎన్నికలకు ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ మాట తప్పడని ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడని వైసిపి బాగా ప్రచారం చేస్తోంది. కాబట్టి బిసిలు వైసిపి విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశాలు మెరుగుపడ్డాయనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: