భారత వాయుసేన-బాలాకోట్ నే టార్గెట్ చేయటం ఎందుకు?

చరిత్రలో బాలాకోట్ 

భారత ఉపఖండంలో బాలాకోట్ అత్యంత పురాతన నగరం. వందలాది ఏళ్ల కిందట అక్కడ హిందువులు అధిక సంఖ్యలో నివసించినట్లు ఆనవాళ్ళున్నాయి. హిందువులకు సంబంధించిన సమాధులు అనేకం ఉన్నాయి. మొఘల్ వంశస్థుల పాలనా కాలంలో బాలాకోట్ హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేయించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్ రాణి నూర్జహాన్, బాలాకోట్ సమీపం నుంచే కశ్మీర్‌ లోకి ప్రవేసించిన ఆధారాలున్నాయి. 



2005 భూకంపం తర్వాత బాలాకోట్ క్రమంగా ఉగ్రవాదుల అడ్డాగా మారింది. జైషే మహ్మ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన యూసుఫ్ అజ‌ర్ బాలాకోట్‌ లో ఒక ట్రైనింగ్ సెంట‌ర్‌ ను న‌డుపుతున్నాడు. జైషే చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ కు బావ‌మ‌రిది అయిన యూసుఫ్ అజ‌ర్ అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. భారత వాయుసేన మంగళ వారం (ఫిబ్రవరి 26) నిర్వహించిన దాడిలో యూసుఫ్ అజ‌ర్ హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. 

పాక్ గడ్డపై ఏయే ప్రాంతాలనుంచి ఏయే ఉగ్రవాదసంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయనే అంశానికి సంబంధించి భారత అధికారులవద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి వెనుక జైషే ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించిన కీలక స్థావరాలున్న బాలాకోట్‌పై భారత వాయుసేన టార్గెట్ చేసింది. 

కేవలం బాలాకోట్ నే ఎందుకు భారత ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా చేసుకొందనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే బాలాకోట్ లోనే జైషే మొహమ్మద్ అతి పెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. అక్కడ ఉన్న దట్టమైన అడవుల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్మించింది. బాలాకోట్ గురించి భారత్ దగ్గర పక్కాగా ఇంటెలిజెన్స్ ఇన్-పుట్స్ ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా భారత వాయు సేన మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో ఐఏఎఫ్ 12 మిరాజ్-2000 రకానికి చెందిన ఫైటర్ జెట్లను ఉపయోగించింది.




బాలాకోట్ టార్గెట్ ఎందుకు?

-పాకిస్థాన్ లో జైషే అతిపెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరం

-బాలాకోట్ క్యాంప్ ను యూసుఫ్ అజహర్ నడిపిస్తున్నాడు

-జైషే చీఫ్ మసూద్ అజహర్ బంధువు యూసుఫ్ అజహర్

-ఆత్మాహుతి దాడి గురించి ప్రభుత్వం దగ్గర పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్

-జనావాస ప్రాంతాలకు దూరంగా శిక్షణ శిబిరం

-పౌరులకు నష్టం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సైనిక చర్య జరిపారు

ఇంటెలిజెన్స్ ఇన్-పుట్ ఆధారంగా చేసిన ఈ దాడి కౌంటర్ టెర్రర్ అటాక్ అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అక్కడ జైషే ఆత్మాహుతి బాంబర్లను తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఇది సైనిక దాడి కాదని కేవలం తనను తాను రక్షించుకొనేందుకు చేసిన దాడి మాత్రమేనని భారత్ తెలిపింది.

జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి భారతీయ వాయుసేన మెరుపులా విరుచుకుపడి చేసిన సర్జికల్ స్ట్రైక్-2 తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద శిబిరాన్ని ఐఏఎఫ్ నేలమట్టం చేసింది. సుమారుగా 400మంది ఉగ్రవాదులను మట్టిలో కలిపేసింది. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేసినట్టు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన ముజఫరాబాద్, చకోట్ శిబిరాలపై జరిపిన దాడుల గురించి ప్రస్తావించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం వాయుసేన ముజఫరాబాద్, బాలాకోట్, చకోట్లలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడుల్లో సమూలంగా ధ్వంసం చేసింది.

భారత వైమానిక దళం పక్కా ప్రణాళికతో బాలాకోట్ పైకి దూసుకెళ్లింది. 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు, పాక్ భూభాగంలో భారత సరిహద్దు నుంచి సుమారు 60 కి.మీ. దూరంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాయి. 21 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తిచేసి తిరిగొచ్చాయి. 1000 కిలోల పేలుడు పదార్థాలున్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో దూసు కెళ్లిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మూడు ప్రాంతాలను టార్గెట్ చేసి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. శత్రుదేశ సైన్యానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా ఈ దాడులు నిర్వహించాయి. 

భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి 1971 యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రవేశించాయి. 1999 కార్గిల్ యుద్ధం లోనూ భారత వాయుసేన విమానాలు ఎల్‌వోసీ ని దాటి వెళ్లకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: