జాగ్రత్త.. ఈ విషయాల్లో భారత్ కంటే పాకిస్తాన్ సైన్యానిదే పైచేయి..?
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. భారత్ సైన్యం 1971 తర్వాత మొట్టమొదటి సారి పాక్ గగనతలంలోకి ప్రవేశించి మరీ ఉగ్రవాద తండాలపై మెరుపుదాడి చేసింది. దాదాపు 350 మందిని మట్టుపెట్టింది. భారత్ చర్యపై పాకిస్తాన్ రగిలిపోతోంది. బదులు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ సైనిక బలాబలాను ఓసారి పరిశీలిస్తే.. అనేక అంశాల్లో భారత్ సైన్యం పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే సైనిక శక్తి ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంటే.. పాకిస్తాన్ 17 వ స్థానంలో ఉంది.
మనకు 13 లక్షల పైచిలుకు సైనికులు ఉంటే.. పాకిస్తాన్ కు 6 లక్షల సైన్యం ఉంది. రిజర్వ్ దళాల విషయంలో మనం పాకిస్తాన్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్నాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పాకిస్తాన్ పైచేయిగా ఉంది. ప్రత్యేకించి పాకిస్థాన్ అణువార్ హెడ్ల విషయంలో భారత్ కంటే పైచేయిలో ఉంది. భారత్ కు 135 అణు వార్ హెడ్స్ ఉంటే.. భారత్ కు అవి 135 మాత్రమే ఉన్నాయి.
శిక్షణ విమానాలు కూడా పాక్ కే ఎక్కువ. భారత్ కు 250 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే.. పాకిస్తాన్ కు అవి 480పైగా ఉన్నాయి. వార్ అటాకింగ్ హెలికాప్టర్లు మనకు 15 మాత్రమే ఉంటే.. పాకిస్తాన్ కు 49 ఉన్నాయి. సెల్ప్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ ఇండియాకు 190 ఉంటే పాకిస్తాన్ కు 307 ఉన్నాయి. భారత్ రక్షణ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లు కాగా.. పాక్ కు రక్షణ బడ్జెట్ లక్ష కోట్లు మాత్రమే.