చైనా తో సహా ప్రపంచం మొత్తం భారత్ వెంటే - ఇప్పుడు పాకిస్తాన్ ఏకాకి!

దుష్టత్వం దుష్ట సాంప్రదాయం దుష్ట దేశం ఇవన్నీ ఒకవేళ విజయం పొందుతున్నట్లు కనిపించినా, అవి శాశ్వతత్వాన్ని పొందలేవు.  పాపిస్తాన్ గా ముద్రపడ్డ పాకిస్తాన్ కు కూడా అదే దుస్థితి పట్టబోతొందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  


అమెరికా లోని పాక్‌ మాజీ రాయబారి, హుసేన్ హుక్కాని ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయన్నారు. ఈ వైఖరి ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రస్థావరాలకు నెలవుగా మారిన దేశాలను ఇక ఏ మాత్రం సహించబోరని తెలిపారు. ఇది పాకిస్థాన్‌కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని హెచ్చరించారు. 



పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన దాడుల అనంతరం అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించడం లేదని, అమెరికా లోని పాక్‌ మాజీ రాయబారి, హుసేన్ హుక్కాని తెలిపారు. తమ అత్యంత మిత్రదేశం ఆప్త మిత్రుడు చైనా కూడా ఈ దాడులపై ప్రస్తుతం మాట్లాడటం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం పరిశీలిస్తే-పాక్‌, ఉగ్ర వాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ప్రపంచదేశాలన్నీ మూకుమ్మడిగా భావించడమే కారణమని, ఇది పాక్‌ కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

అత్యంత శక్తివంతమైన పాక్‌ ఆర్మీకి తరుచుగా రాడికల్‌ గ్రూప్‌ల నుంచి బెదిరింపులు వస్తుంటాయన్నారు. ప్రస్తుతం "హడ్సన్ ఇన్స్టిట్యూట్ థింక్-ట్యాంక్" కు సౌత్‌ సెంట్రల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హుసేన్ హుక్కాని, ఇటీవల "రి-ఇమేజింగ్ పాకిస్తాన్"  అనే పుస్తకాన్ని విడుదలచేశారు.




ఇక ప్రపంచ దేశాలు పాక్‌ కు అనుకూలంగా లేవన్న విషయం అంగీకరించ దగినదేనని పాకిస్తాన్‌ స్కాలర్‌ మోయిద్‌ యూసఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా పాక్‌కు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు భారత్‌కే మద్దతిస్తున్నాయని తెలిపారు. 


ప్రపంచం మొత్తం నేడు భారత్‌కు అనుకూలంగా ఉంది. దీంతో భారత బలగాలు పాక్‌ భూభాగంలో చొరబడినా పెద్ద విషయం కాలేదు. ఇది పాకిస్తాన్‌ కు పెద్ద సవాలే.’ అని చెప్పు కొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: