ఎడిటోరియల్ : జలీల్ కు రివర్స్ పంచ్ అదిరింది

Vijaya

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మనకు ఓ నానుడుంది.  బికాంలో ఫిజిక్స్ చదివిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కు బాగా వర్తిస్తుంది. గతంలో తాను చేసిన ఓ పనికిమాలిన పనే ఇపుడు రివర్సవుతోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలో అర్ధం కావటం లేదు. 2009లో జలీల్ చేసిన పాపమే 2019 ఎన్నికల్లో కూతురు షభానా ఖాతూన్ కు శాపమై కూర్చుంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, 2009లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎంఎల్ఏగా అప్పటి మేయర్ మల్లికాబేగం పోటీ చేశారు. తనకు టికెట్ రాకుండా చేసిందన్న కోపంతో మల్లిక ఓటమికి జలీల్ కారణమయ్యారు. ఎలాగంటే, ముస్లిం మహిళలు బురఖా దరించకుండా రాజకీయాల్లో పాల్గొనకూడదనే వాదన తెరపైకి తెచ్చారు. దేశంలో మరే మహిళ విషయంలో లేని నిబంధనను జలీల్ అప్పట్లో తెరపైకి తెచ్చారు.

 

జలీల్ ఒత్తిడికి లొంగిన మతపెద్దలు మల్లికాబేగంను బురఖా లేకుండా ప్రచారం చేయొద్దంటూ ఆదేశించారు. బురఖా లేకుండా బయట తిరగలేక బురకా వేసుకుని ప్రచారం చేయలేక అప్పటి ఎన్నికలో మల్లిక ఓడిపోయింది. సరే అదంతా చరిత్రనుకోండి అది వేరేసంగతి.

 

జలీల్ ఖాన్ చేసిన పనికి బదులు తీర్చుకునే అవకాశం ఇపుడు మల్లికకు వచ్చింది. అనారోగ్యం కారణంగా తనకు బదులు తన కూతురు షభానా ఖాతూన్ కు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబును  జలీల్ కోరిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఏం చెప్పారో తెలీదు కానీ తన కూతురే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని జలీల్ చెప్పేసుకుంటున్నారు. 

 

సరిగ్గా ఇక్కడే మల్లిక తెరపైకి వెచ్చారు. బురఖా ధరించకుండా ఖాతూన్ రాజకీయాల్లో ఎలా పాల్గొంటారంటూ ఫిట్టింగ్ పెట్టారు. అప్పట్లో తనకొక రూలు ఇపుడు షభానాకు మరోరూలా అంటూ మతపెద్దల దగ్గర పెద్ద పంచాయితీనే పెట్టించారు. దాంతో చేసేది లేక బురఖా ధిరంచకుండా రాజకీయాల్లో పాల్గొనకూడదంటూ షభానా విషయంలో మతపెద్దలు తాజాగా ఫత్వా జారీ చేశారు. మరి జలీల్ ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: