మోడీకి లేఖలో గట్టిగా కౌంటర్లు వేసిన చంద్రబాబు..!

KSK
2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పర్యటిస్తూ ఆంధ్ర ప్రజలకు అనేక హామీలు ప్రధాని మోడీ ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చాక మోడీ ప్రజలను మోసం చేశారని ఇటీవల మోడీ కి లేఖ రాశారు చంద్రబాబు. విశాఖపట్టణంలో పర్యటించనున్న మోడీ కార్యక్రమాన్ని చీకటి దినం గా అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబు.


విశాఖలో పర్యటించనున్న మోడీ పర్యటన ఉద్దేశించి చంద్రబాబు లేఖలో మొత్తం 17 అంశాలను పేర్కొన్నారు.” పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు రాకుండా అడ్డుకున్నారు. ఏపీకి అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకుండా అడ్డుకున్నారు.


175 శాసనసభ స్థానాలను 225కి పెంచాలని చట్టంలో పేర్కొన్నా ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం రాజకీయ కుట్రే.” పునర్‌విభజన చట్టంలోని అంశాలను ఇప్పటి వరకు అమలు చేయలేదని, ప్రజాస్వామ్యానికి తూట్లుపొడిచిన తమరు రిక్తహస్తాలతో ఏపీకి రావడం తలవంపుగా లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.


రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసింది వంటి విషయాలను ప్రజలు మొత్తం గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో దేశంలో మరియు రాష్ట్రంలో కూడా బీజేపీకి ఎదురుగాలి వెయ్యడం గ్యారెంటీ అని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: