ప్రత్యేకం: నిప్పుకు చెదలు పడుతుంది అన్నట్లు క్రమంగా ప్రతిష్ట కోల్పోతున్న చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన తరవాత నారా చంద్రబాబునాయుడులో ప్రవర్తనలో విపరీత పోకడలు విజృంభిస్తున్నాయి. నిప్పుకు చెదలు పడుతుంది అన్నట్లు క్రమంగా ప్రతిష్ట కోల్పోతున్నారు చంద్రబాబు. 


కేంద్రం నుంచి విభజన ప్రయోజనాలు సాధించాల్సిన వాళ్లు దాంతో కయ్యం పెట్టుకొంటూ సాధించేది బూడిద మాత్రమే! ఇప్పుడు బిజేపి ఏపి నుండి ఏమీ ఆశించట్లే దు సరి కదా అన్నింటికి తెగించినట్లే ఉంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నంతవరకు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని ఎవరైనా బాగుచేస్తారను కోవటం భ్రమే! చంద్రబాబు రాష్ట్రానికి చేసిన కీడు అంతా ఇంతా కాదంటున్నారు పచ్చమీడియా హఔజెస్ కు చెందని రాష్ట్ర వ్యాప్త దేశ వ్యాప్త రాజకీయ విశ్లేషకులు.   


  • అత్యంత జుగుప్సాకరమైన "ఓటుకు నోటు" ద్వారా శాసనసభ్యులను కొనేసి తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నంలో తానే ధారుణమైన ఊబి లోకి కూరుకు పోయాడు. దాని ఫలితంగానే రాత్రికిరాత్రి మూటా ముల్లే సర్ధుకొని "పదేళ్ళ ఉమ్మడి రాజధాని ఏర్పాటు" విభజన ప్రయోజనాన్ని వదిలేసి అత్యంత అప్రతిష్టాకరంగా, అవమానకరంగా హైదరాబాద్ వదిలేసి అమరావతికి మందీమార్బలంతో తరలి వెళ్ళాల్సిరావటం, దాంతో తెలుగు దేశం పార్టీ తన  నామ రూపాలు  తెలంగాణాలో  కోల్పోతూ వచ్చింది.

  • తెలంగాణాలో వైఫల్యం చెందినా "ఓటుకు నోటు పథకం" నిశ్శిగ్గుగా అమలు పరచి నలభైయేళ్ళ సుధీర్గరాజకీయ అనుభవం అంటూ నేర్చుకున్న మురుగులో కొట్టుకు పోతూ ఆయన దాన్నే గెలుపు అనుకోవటం అత్యంత దయనీయం.


  • నాలుగేళ్ళకు పైగా కలసి నేరపిన రాజకీయ మైత్రిని ఒక్క దెబ్బతో తుంచేసుకొని నరేంద్ర మోడీ నాయకత్వంలోని "జాతీయ ప్రజాస్వామ్య కూటమి" కి తిలోదకాలు ఇచ్చి అదే కూటమిని అదే నాయకత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా కాలం గడిపేస్తున్నారు. నవ నిర్మాణ దీక్షలు, ధర్మ దీక్షలు అంటూ వందల కోట్ల ప్రజాధనాన్ని జిల్లాల వారీగా దుబారా చేస్తున్న ఆయన్ని చూస్తూ అదే ప్రజలు ఆయన ఒక ముఖ్యమంత్రేనా?  ఆశించిన అభివృద్ధికి కృషి చేసి సాధించాల్సిన వ్యక్తేనా? అని అఖిలాంధ్ర ప్రజలు విస్తుపోతున్నారు.  మారిన ఆయన ప్రవర్తన, ఆయన తీరే ఆయనకు అపజయాన్ని ఆపాదించనుంది.


  • బిజెపితో మైత్రి నెఱపినంత కాలం ప్రధాని నరేంద్ర మోడీని అపర నరేంద్రుడని శాసనసభ వేదికపై పలు బహిరంగ వేదికలపై పార్టీ వందిమాగధుల సమేతంగా బృందగానం చేస్తూ పొగిడిన ఆనోళ్ళతోనే నేడు ఆయన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తెగనాడటం చంద్రబాబు చెల్లింది. నరేంద్ర మోడీని శత్రువుగా భావించవచ్చు - కాని ఆయన దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ప్రధానమంత్రి. ఆయన దేశంలో ఏ రాష్ట్రానికైనా వచ్చి పర్యటించే అధికారం పూర్తిగా ఉంది. ఆయనను ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన భాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉంది. అది పూర్తిగా రాష్ట్ర సాంప్రదాయం. ఆ బాధ్యత నిర్వహించక పోతే ఆయన తన అస్థిత్వం కోల్పోయినట్లే. 


  • ప్రత్యేక హోదా లాంటి విభజన ఫలాల కోసం ఇంతలా అంగలారుస్తున్న ముఖ్యమంత్రి వర్యులు - ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎందుకు వదిలేసి వచ్చారు? అది ఇప్పుడు  ఐదుకోట్ల అంధ్రుల ప్రధాన ప్రశ్న కాబోతుంది. అంధ్రుల ప్రశ్న మాత్రమేకాదు దేశం యావత్తూ నాలుగేళ్లకు పైగా నరెంద్ర మోడీని, బిజేపిని పొగిడిన తీరును ఎండగట్టబోతున్నారు. ఇంతకాలం తెగపోగడటంలోని ఆంతర్యమేమిటి? దానికి మీరు,  మీ ఎంపిలు, మీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి పోందిన దేమిటి? అలాకానప్పుడు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు?


  • ఈ ప్రయోజనం పదేళ్లు కాదు చండిగడ్ లాగా ఎంతకాలమైనా అనుభవించ వచ్చు. ప్రత్యేక హోదా కోసం ఇంతలా ఓవర్ యాక్షన్ చేసే ప్రత్యేక హోదా సాధన సమితి అధినేత చలసాని శ్రీనివాస్ ఈ విషయం గురించి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరు? మరి అలాంటి ముఖ్యమంత్రి డిల్లీలో మోడీపై తిట్లదండకం ప్రారంభించినప్పుడు ఎందుకు ఆయనతో వేదిక పంచుకున్నారు? అదే ప్రతిపక్షం తమ పార్లమెంటరీ పక్షం చేత రాజీనామా చేయించినప్పుడు వారికి మద్దతు పలకలేదేమిటి?  దీని వెనుక మర్మం నెపోటిజమా? కాస్టిజమా?  అవేవీ కాకపోతే ఇదే ప్రత్యేక హోదా కోసం విడవకుండా పోరాడే ఇతర వ్యక్తులకు పార్టీలకు ఎందుకు మద్దతు ఇవ్వరు? దానికి జనం కారణాలు వెతుకుతున్నారు.  


  • ప్రత్యేక హోదా నిజంగా కోరే వీరు - ప్రత్యేక హోదా సంజీవని కాదని - ప్రత్యేక పాకేజి అనుమతించినందుకు బిజెపి నాయకత్వానికి శాసనసభ సాక్షిగా అభినందన మందార మాలలు విసిరిన ఈ ముఖ్యమంత్రి ఆయన బృందం బిజేపి మంత్రులకు ప్రత్యేకించి నేటి ఉపరాష్ట్రపతి, నాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గారికి చేసిన పలు సన్మానాలు ఏవరైనా మరచి పోగలరా?  శాసనసభ రికార్డులు చెప్పవా? నాటి వార్తల కటింగ్స్ కనిపించవా?


  • అసలు రాష్ట్రం కోసం ఏదైనా సాధించాలంటే ప్రధానితో ఎంతో కొంత సఖ్యత కొనసాగించటం ముఖ్యమంత్రి బాధ్యత. అదీ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఇంకా అవసరం. అలాంటిది ఆయనతో పూర్తిగా విబేధించే ఇతర రాజకీయ నాయకులతో ఐఖ్యమై రాష్ట్రానికి చేసే ద్రోహం అంతా ఇంతా కాదు. అంతేకాదు ప్రయోజనాలు సాధించాల్సినచోట పరమ అసహ్యంగా ప్రవర్తించటం సుధీర్ఘ అనుభవానికి ప్రతీక కానేరదు. అలాంటి వ్యక్తి ఆ కులజనుల చేత అపర చాణక్యుడు అని పిలవ బదటం కూడా అత్యంత జుగుప్సాకరం. మనం నోరారా తీట తీరేవరకు ఒక వ్యక్తిని తిడుతూ అదే వ్యక్తి రాష్ట్రానికి అదివ్వలేదు? ఇదివ్వలేదు అనటం ఎంతవరకు న్యాయం? 


  • చివరకు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కైంది. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై స్వయానా పోలీస్ డైరెక్టర్ జనరల్ తన బాధ్యత మరచి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ విషయంపై ఆ తరుణాన  ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనకు శోభించలేదు. అనుమానం అంతా ఆయనవైపే చూపుడు వేలు చూపుతుంది. ప్రతిపక్ష నేత సైతం తన కేసును ఏపి పోలీసుల విచారణను అంగీకరించలేదు.


  • ఆఖరకు హత్యచేయబడ్డ ప్రవాసాంద్ర పారిశ్రామికవేత్త జయరాం హత్య కేస్ విచారణ సందర్భంలోనూ జయరాం శ్రీమతి కూడా బాధితురాలు ఏపి పోలీసులపై తనకు విశ్వాసం లేదని తన భర్త హత్య కేసును పొరుగు రాష్ట్రం తెలంగాణాకు బదిలీ చేయమని కోరటం ప్రజలకు ఏపి ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసలేమి తెలుపుతుంది.


  • ఇక వైజాగ్ కేంద్రంగా  సౌత్ కోష్ట్ రైల్వే ప్రకటనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా దానిపై చలసాని వ్యాఖ్యలు చంద్రబాబు తీరు అసంధర్భంగా ఉన్నాయి. ఈ ప్రకటన ఎన్నికల తాయిలంగా చెప్పే ఈ వ్యక్తులు - చంద్రబాబు ఈ మద్య ప్రకటించిన ఎన్నికల తాయిలాల మాటేమిటి? ప్రధానితో గిల్లికజ్జాలు పెట్టుకొనే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి కేంద్రం పెట్టేది సున్నమే. అయినా గుడ్డిలో మెల్లగా నైనా వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు సహరించటం గ్రేటే!  ఏం చేసినా మోడీకి చంద్రబాబు చేసేది అవమానమే కాబట్టి, ఇక్కడ బిజెపికి రాజకీయంగా లభించే ప్రయోజనమూ ఏమీ లేనందున ఇక మోడీ మాత్రం ఏంచేయగలరు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 


  • తెలంగాణాలో అనవసర రాజకీయాలుచేసి అక్కడ ముప్పేట రాజకీయదాడులతో ధారుణ పరాభవం మూటగట్టుకోవటం ఆపై కేసీఆర్ అందించనున్న రిటర్న్ గిఫ్ట్ అందుకోవటం  ఒక పెద్ద ప్రమాదంగా మారనుంది. అంతే కాకుండా అసలు తెలుగు దేశం పార్టీ ఏర్పాటుకు కారణమైన అరాచకవాద కాంగ్రెస్ తో అసాంఘిక పొత్తు పెట్టుకొని టన్నులకొద్ది తెలంగాణాలో పరాభవం పొందిన చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా, వీపుమీద తన్నించుకొని బయట పడ్డారు. ఇందులో లగడపాటి రాజగోపాల్ 'ఒక బేకార్ వ్యక్తి' గా మిగిలిపోయాడు.


  • ప్రత్యేక హోదా విషయంలో అనేక సార్లు యు-టర్న్ తీసుకోవటం - తొలి నుంచీ ప్రత్యేక హోదా విషయంలో 'ఒకే స్టాండ్'  మీద ఉన్న వైసిపిని అనుక్షణం బదనాం చేయ ప్రయత్నించటం ప్రజల్లో ప్రతిపక్షం పట్ల విశ్వాసం ద్విగుణీకృతమైంది. అదే సమయంలో పాదయాత్ర లో ఉన్న ప్రతిపక్ష అధినేత ప్రజల్లో ముఖ్యమంత్రి తీరును బట్టబయలు చేస్తూ కొనసాగిన తీరుతో దానికి మంచి ప్రచారం జరిగింది.


  • 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత టిడిపి అధినేత, ఏపి ముఖ్యమంత్రి ఏపి ప్రజలకు చేసిన 600 వాగ్ధానాల చిట్ఠాలో,  60 కూడా నేఱవేర్చని వైనం ప్రజల హృదయాంతరాల్లోకి వెళ్ళిపోయింది.


  • చంద్రబాబు ఆడిన అబద్ధాలను బహుముఖంగా సాక్షి మీడియాతో పాటు- వైసిపి సామాజిక మాధ్యమంలో- కూడా ఉవ్వెత్తున ప్రచారం అవటం, ఆ ఉదృతి ముందు "పచ్చ మీడియా" చేసే పాడిందే పాడరా! పాచిపళ్ళ పిచ్చోడా!" అన్నట్లున్న ప్రచారం వెలవెల పోయిందనే చెప్పాలి.


  • జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఆయన పార్టీ కార్యకర్తల నుండి ప్రజాప్రతినిధుల వరకు - అమరావతి నిర్మాణంలో చూపిన నృత్య విన్యాసాలు, విశ్వ నగరం పేరుతో కొనసాగించిన భూకబ్జాలు, కాల్మని, రెడ్ సాండల్, కల్తీ, ఆయిల్, సాండ్, మైనింగ్, ఎడ్యుకేషన్, విద్యా, ఆరోగ్య, వైద్య, చివరకు మీడియా మాఫియాలు చెలరేగి చేసిన దుర్మార్గం, దౌష్ట్యం, దురాగతాలు సమాజంలో మున్నెన్నడూ కనిపించనంతగా బహిర్గతమయ్యాయి.  


  • చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ను శాసనమండలి లోకి తీసుకురావటం, ఆపై మంత్రిని చేయటంపై ప్రదర్శించిన శ్రద్ధ, విభజనఫలాల సాధనలో చూపక పోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలని తీవ్రంగా కలచివేసింది. ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రిటీలను సైతం వీపులు పగలగొట్టించి జైళ్ళలోకి కుక్కేసిన వైనం చరిత్రలో శిలాక్షరాలతో లిఖించబడింది. 


  • ఎన్నికలలో టిడిపి గెలుపే ప్రాధమ్యంగా సాగిన నంద్యాల ఉప ఎన్నికలో , డబ్బుతో గెలిచెయ్యొచ్చు అన్నది రూఢీ కావటంతో ప్రత్యేక హోదాతో ముడిపడ్ద ప్రజా ప్రయోజనాలను సాధించటన్ని వదిలేసి ప్రత్యేక పాకేజీ పై దృష్టి పెట్టిననాడే తెలుగుదేశం ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. వ్యక్తిగా చంద్రబాబు, ముఖ్యంగా ఆయన అనుభవం జాతికి ఏ మాత్రం ఉపయోగపడలేదని ఋజువైంది.  


  • వైసిపి దాదాపు శాసనసభ నుండి తప్పుకునేంత స్థాయిలో ఆ ప్రతిపక్ష శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను కొనేసిన తీరు, ప్రజాస్వామ్యానికి పాతరేసిన పాపం ఇప్పుడు ప్రతిపక్ష వైసిపికి సానుభూతి పంట పండించనుంది. అంతే కాదు తనతో జట్టుకడితే ఆ పార్టీ విలువలున్న పార్టీగా - తనతో పొత్తు పెట్టుకోని పార్టీని ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖిగా ప్రచారం చెయ్యటం టిడిపికి చంద్రబాబుకు ప్రజల్లో వ్యతిరేఖాగ్నికి ఆజ్యం పోసేదే!


  • నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష వైసిపి అడ్దొస్తుందని, తెరాస, వైసిపి, బిజేపి మైత్రి గురించి, మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని అత్యంత ధారుణంగా సభ్యత మరచి విమర్శించటం ఇవన్నీ జనంలో చంద్రబాబుపట్ల  వైముఖ్యాన్ని పెంచేస్తున్నాయి.


* తాను రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా- రాష్ట్ర విభజన ద్వారా సిద్ధించిన కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి లక్షలకోట్ల ప్రయోజనం నీళ్ళ పాలు చేయటం ఏపి ప్రజలకు తలగొట్టేసిన విధమైంది.

* ఓటు కు నోటు తో చంద్రబాబు చమ్మచెక్కలాట

* అమరావతి కి నిర్మాణ ప్రణాళికలు ఐదేళ్లకైనా సిద్ధం చేయలేని ఆయన అసమర్ధత

* బాహుబలి సినీ దర్శకుని నేత్రుత్వంలో విశ్వనగర నిర్మాణ ప్లాన్స్ తయారు చెఉయాలను కోవటం హాస్యాస్పధమైంది.

* పుష్కారాల్లో చంద్రబాబు కుటుంబంవల్ల 30మంది సామాన్యుల మరణం

* ఆపై కనీస ఎలాంటి క్షమాపణ కోరక పోవటం, బాధను వ్యక్తం చేయకపోవటం

* ప్రచారార్భాటం - కేంద్ర ప్రయోగనాలకు తన బొమ్మలను కలిపి ముద్రించి ప్రచారం చేసుకోవటం

* ప్రజలనుండి గెలవలేని లోకెష్ మాటల తీరు, చేతకానితనంతో మొత్తం బాబు ఆయన పార్టీ అపహస్యం కావటం

* ముఖ్యమంత్రి అయి ఉండీ తన చేతగాని తనంతో రాష్ట్ర ప్రయోజనాలు రాబట్తలేక న్యాయ ధర్మ నవ నిర్మాణ దీక్షలు చేయటం మన రాష్ట్ర సంపదను వేరె రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేఖ పక్షాలను అధికారంలో నిలపటానికి తరలించటం

* తెలంగాణా నుండి ఘజని మహ్మద్ లా పారిపోయి అమరావతి వచ్చి మళ్ళ అక్కడ కాంగ్రేస్ నాయకత్వంలో కూటమి నిర్మించి తనే సారధ్యం వహించి — మొత్తం  గౌరవాన్ని కోల్పోయేలా ఓటమి చవిచూసి పరువు ప్రతిష్ట గౌరవం సిగ్గుతో సహా ఆసాంతం కోల్పోయి - ఇంకా బిజెపి, టిఆరెస్, వైసిపిలపై మాట్లాడటం అందరూ ప్రశ్నించే అంశాలై పోయాయి. 

* బిజేపి చేయని వాటిని మాట్లాడే చంద్రబాబును - తాను చేసినవేమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

* చంద్రబాబు పాలనలో చింతమనేని, దేవినేని, బండారు, అచ్చన్ నాయుడు లాంటి దుష్టచతుష్టయం పై అసోసియేషణ్ ఫర్ డెమొక్రటిక్ రిఫాంస్ (ఏడీఅర్) రూపొందించిన నివేదికే స్త్రీలపై టిడిపి ప్రదర్శించే లైంగిక హింసను బట్ట బయలు చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: